
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు
. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Iran Peace Deal: ఇరాన్‌తో గత కొన్ని రోజులుగా సీజ్ ఫైర్.. శాంతి చర్చలు ఒక అడుగు ముందుకు.. మూడడులు వెనక్కి అన్నట్టుగా సాగుతున్నాయి. శాంతి చర్చలు ఒక కొలిక్కి వచ్చాయనకుంటున్న టైమ్‌లో ఒకరిపై ఒకరు ప్రతీకార దాడులతో శాంతి చర్చలకు తీవ్ర విఘాతం ఏర్పడుతూ వస్తుంది. తాజాగా హార్మూజ్ వద్ద అమెరికా అపాచీ హెలికాప్టర్స్‌ను ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ పేల్చడంతో అమెరికా.. ఇరాన్ పై దాడులకు తెగపడింది. అంతేకాదు ఇరాన్ అంతం చూస్తానని ట్రంప్ భీషణ ప్రతిజ్ఞ చేశాడు. ఇంతలోనే కొద్ది గంటలకే ఇరాన్‌తో పీస్ టాక్స్ ఒక కొలిక్కి వచ్చినట్టు సంచనల ప్రకటన చేశారు.
ఇక ట్రంప్ కూడా తమ ప్రతిపాదలనకు ఇరాన్ దేశ అగ్రనాయకత్వంఅంగీకరించిందని చెప్పారు. ఒప్పందానికి సంబంధించిన విషయాలను ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, తుర్కియే, పాకిస్థాన్, బహ్రెయిన్, ఈజిప్టు కూడా సమ్మతి తెలిపాయని సోషల్ మీడియా అయిన ట్రూత్ పోస్టు ద్వారా వెల్లడించారు. ఇక జరగాల్సింది సంతకాలేనని చెప్పారు. అది ఏ రోజు, ఎక్కడ అనేది త్వరలో ప్రకటిస్తానన్నారు ట్రంప్.
ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధం కలిగి ఉండకూడదనేదే డీల్ : ట్రంప్
ఒప్పందం పూర్తిస్థాయిలో ఆచరణ రూపంలోకి వచ్చేవరకు ఇరాన్ ఓడరేవులపై తమ దిగ్బంధం కొనసాగుతుందని స్పష్టంచేశారు. అయితే.. అమెరికాతో ఎలాంటి ఒప్పందం కుదరలేదని ఇరాన్ మరోసారి తేల్చిచెప్పి ట్రంప్‌కు బిగ్ షాక్ ఇచ్చింది. అంతకు ముందు... ఇరాన్ చమురు క్షేత్రాలను పూర్తిగా నియంత్రణలోకి తీసుకుంటానని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ రాత్రికే అత్యంత గట్టి దెబ్బ తీస్తామన్నారు. ఆ దేశంలోని చమురు, సహజవాయు పరిశ్రమలన్నింటినీ స్వాధీనంలోకి తీసుకుంటామన్నారు. ఖర్గ్ దీవిపై నియంత్రణ సాధించే రోజు ఎంతో దూరంలో లేదని ప్రకటించారు.
హర్మూజ్ మీదుగా లక్షల బ్యారెళ్ల చమురును రహస్యంగా తరలించామని, ఈ విషయాన్ని ఇరాన్ కూడా ఇప్పుడే తెలుసుకుంటుందని ట్రంప్ అన్నారు. ఒక్క రాత్రే 22 నౌకలను తరలించామన్నారు. చిమ్మచీకట్లో లైట్లు లేకుండా, రాడార్లకు చిక్కకుండా వాటిని సురక్షితంగా పంపించామన్నారు. బుధవారం కంటే ఎక్కువ తీవ్రతతో అగ్రరాజ్య దళాలు గురువారం ఇరాన్‌పై విరుచుకుపడ్డాయి. ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ నగరంలో భారీ పేలుళ్లు చోటుచేసుకున్నట్లు సమాచారం. అమెరికా దృష్టిసారించిన సిరిక్, మినాబ్ పట్టణాలు, ఖేష్మ్ ద్వీపం, ఉత్తర ప్రాంతంలోని గోర్గాన్ నగరంలోనూ పేలుళ్లు సంభవించినట్లు వార్తలు వెలువడ్డాయి. పర్షియన్ గల్ఫ్ వద్ద ఇరాన్ రాడార్, గగనతల రక్షణ వ్యవస్థలను దెబ్బతీసినట్లు అమెరికా వెల్లడించింది. కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసినట్లు ఇరాన్ సైన్యం పేర్కొంది. అమెరికా తమ సహనాన్ని పరీక్షిస్తోందని, దాడులు, బెదిరింపులకు తమ సాయుధ దళాలు కచ్చితంగా స్పందిస్తాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు. క్షేమంగా ఉండాలనుకుంటే, వెంటనే ఈ ప్రాంతాన్ని వీడాలని అమెరికా బలగాలను హెచ్చరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.