టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటారు. రాయల్ లుక్, స్టైలిష్ విలనిజంతో మెప్పించే ఆయన.. తాజాగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు
సృష్టిస్తున్న ‘పెద్ది’ చిత్రంలో అప్పలసూరి అనే పల్లెటూరి వ్యక్తి పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో, దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి జగపతిబాబు ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన పాత్ర ఎంపిక, షూటింగ్ విశేషాలు, ఇండస్ట్రీ తీరుపై ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.* ‘కరుప్పు’ బ్లాక్‌బస్టర్‌తో జోరు పెంచిన సూర్య.. అనిల్ రావిపూడితో ల్యాండ్‌మార్క్ మూవీ? అప్పలసూరి పాత్రకు థియేటర్లలో లభిస్తున్న ఆదరణ చూసి ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ దర్శకుడు జగపతిబాబుకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి మాట్లాడారట. ఆ సంభాషణను జగపతిబాబు ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంటూ.. "ఈ అప్పలసూరి క్యారెక్టర్‌ను ఎవరైనా మలయాళం, తమిళం లేదా హిందీ నటుడు చేసి ఉంటే, ఇండస్ట్రీ వర్గాలు వారిని ఆకాశానికి ఎత్తేసేవి. కానీ మీరు తెలుగు నటుడు కావడం మీ బ్యాడ్ లక్. మనవాళ్లు మన ప్రతిభను అంతగా గుర్తించి లేపరు" అని ఆ డైరెక్టర్ అన్నట్లు పేర్కొన్నారు. గతంలో 'అరవింద సమేత' చిత్రంలో తాను చేసిన వీరారెడ్డి క్యారెక్టర్ తర్వాత, ఒక నటుడిగా తనకు పూర్తి స్థాయి తృప్తిని, విపరీతమైన గుర్తింపును తెచ్చిపెట్టిన పాత్ర ఇదేనని జగపతిబాబు స్పష్టం చేశారు.మరోవైపు ఈ పాత్ర ఎంపిక వెనుక ఉన్న కష్టాన్ని దర్శకుడు బుచ్చిబాబు వివరించారు. ‘పెద్ది’ సినిమా అనేది హీరో తర్వాత పూర్తిస్థాయిలో అప్పలసూరి చుట్టూనే తిరుగుతుందని, ఈ పాత్రపై ప్రేక్షకులకు అమితమైన జాలి కలగాలని బుచ్చిబాబు చెప్పారు. అయితే జగపతిబాబు స్క్రీన్ మీద ఎప్పుడూ ఎంతో రాయల్‌గా కనిపిస్తారని, అందువల్ల ఈ పాత్రకు ఆయన సెట్ అవుతారా లేదా అని మొదట్లో చాలా సందేహించానని తెలిపారు. చివరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత సహాయంతో స్టోరీ బోర్డును సిద్ధం చేసి చూశాక.. ఈ క్యారెక్టర్‌కు జగపతిబాబు కంటే ఉత్తమమైన ప్రత్యామ్నాయం మరొకరు లేరని ఫిక్స్ అయినట్లు బుచ్చిబాబు వెల్లడించారు.* 'పెద్ది' టిక్కెట్ ఆఫర్ల మాయాజాలం.. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, పేమెంట్ దగ్గర అసలు ట్విస్ట్! ఈ పాత్ర కోసం జగపతిబాబు తన రెగ్యులర్ గ్లామరస్ లుక్‌ను పూర్తిగా పక్కనబెట్టేశారు. గుర్తుపట్టడానికి వీల్లేని విధంగా వినూత్నమైన ప్రోస్థటిక్ మేకప్ వేసుకుని, అచ్చమైన గ్రామీణ వ్యక్తిలా మారిపోయారు. కేవలం రూపమే కాకుండా, తన నడక, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీలో సైతం కొత్తదనాన్ని చూపించారు. షూటింగ్ సమయంలో ఆయన నటనకు ఫిదా అయిన సెట్ లోని వారంతా ప్రతి షాట్ ముగియగానే చప్పట్లు కొట్టేవారని జగ్గుభాయ్ గుర్తుచేసుకున్నారు. అయితే సెట్లో టీమ్ అంతా అంతలా మెచ్చుకున్నా.. సినిమా విడుదలైన తర్వాత ఈ పాత్రకు దక్కాల్సిన స్థాయి ప్రమోషన్ కానీ, ఆశించిన మేర గుర్తింపు కానీ రాలేదని బుచ్చిబాబు ముందే జగపతిబాబు తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.