
ఒకప్పుడు దండకారణ్యంలో తుపాకీ పట్టి దళాలకు నాయకత్వం వహించిన మావోయిస్టు మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, సుమారు 42 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తన ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశారు
. న్యాయవాది కావాలనే తన లక్ష్యం దిశగా ఆయన తొలి అడుగు వేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలీసుల ఎదుట లొంగిపోయిన ఆయన, మధ్యలో ఆగిపోయిన చదువును కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన దేవ్‌జీ, 1980-82 మధ్య స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఎంపీసీ గ్రూపులో చేరారు. ఆ సమయంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ) ప్రభావంతో ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యారు. దీంతో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో అన్ని పరీక్షలు రాసినా, ఒక్క తెలుగు పరీక్ష మాత్రం రాయలేకపోయారు. రాసిన సబ్జెక్టులన్నిటిలోనూ పాసయ్యారు. అప్పట్లో పీపుల్స్‌వార్‌లో చేరి అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఆయన చదువు అసంపూర్తిగా మిగిలిపోయింది.జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత తన చదువును పూర్తి చేయాలని భావించిన దేవ్‌జీకి తెలంగాణ ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది. ఇటీవల జరిగిన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఆయన మిగిలి వున్న తెలుగు పరీక్షకు హాజరయ్యారు. గురువారం విడుదలైన ఫలితాల్లో దేవ్‌జీ తెలుగులో 72 మార్కులు సాధించి ఉత్తీర్ణులయ్యారు. దీంతో ఆయన మొత్తం 614 మార్కులతో ఇంటర్ పూర్తి చేసినట్లయింది.న్యాయవాద వృత్తిపై ఆసక్తితో దేవ్‌జీ ఇటీవలే లాసెట్ పరీక్ష రాయగా, అందులో 349వ ర్యాంకు సాధించడం విశేషం. ఇప్పుడు ఇంటర్ కూడా పూర్తి కావడంతో ఐదేళ్ల లా కోర్సులో చేరేందుకు ఆయనకు