మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే రూ. 300 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన ఈ చిత్రం, లాంగ్ రన్లో రూ
. 500 కోట్ల మార్కును అందుకోవడం ఖాయమని మేకర్స్ ధీమాగా ఉన్నారు. అయితే, ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు థియేటర్ల యాజమాన్యాలు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ సినిమాస్ ‘పెద్ది’ సినిమా టిక్కెట్ల బుకింగ్‌పై "ఒకటి కొంటే ఒకటి ఉచితం" (Buy 1 Get 1 Free) అంటూ సోషల్ మీడియాలో భారీగా ప్రచార ప్రకటనలు గుప్పించింది. పీవీఆర్ సినిమాస్ యాప్ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకుంటే ఈ ఆఫర్ వర్తిస్తుందని సదరు ప్రకటనలో పేర్కొన్నారు.* ‘అడుక్కున్నా వరలక్ష్మి ప్రమోషన్‌కి రాలేదు.. డబ్బింగ్ చెప్పకుండా మమ్మల్ని ఏడిపించింది’.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ తీరా ప్రేక్షకులు ఈ ఆఫర్ చూసి టిక్కెట్లు బుక్ చేస్తుంటే పేమెంట్ గేట్‌వే వద్ద సీన్ రివర్స్ అవుతోంది. ఉచిత టిక్కెట్ ముచ్చట పక్కన పెడితే, రెండు టిక్కెట్లకూ పూర్తి స్థాయి మొత్తాన్ని వసూలు చేస్తున్నట్లు నెటిజన్లు స్క్రీన్షాట్లతో సహా బయటపెడుతున్నారు. బుకింగ్ చివరి దశలో (Checkout మరియు UPI పేమెంట్ పేజీలో) ఎటువంటి డిస్కౌంట్ లేకుండా పూర్తి మొత్తాన్ని భరించాల్సి వస్తున్నట్లు స్పష్టమవుతోంది. రెండు టిక్కెట్ల డబ్బులు కట్టించుకున్నాక, ఒక టిక్కెట్ మొత్తాన్ని తర్వాత రిఫండ్ చేస్తారా లేదా అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి పీవీఆర్ సినిమాస్ ఇలాంటి తప్పుడు మరియు మోసపూరిత ప్రకటనలు చేస్తోందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా మండిపడుతున్నారు. తొందరపడి టిక్కెట్లు బుక్ చేసుకుని మోసపోవద్దని తోటి ప్రేక్షకులకు సూచిస్తున్నారు. మరోవైపు డిస్ట్రిక్ట్ యాప్ మాత్రం రెండు టిక్కెట్లు కొంటే రూ.100 డిస్కౌంట్ అని ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం 'పెద్ది' సినిమా టికెట్ ధరలను పెంచుతూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు, ప్రీమియర్ షోలు, రోజుకు 5 షోల ప్రదర్శనకు అనుమతినిచ్చింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం సైతం సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 వరకు పెంచుకునేందుకు మెమో జారీ చేసింది. అయితే ఈ పెంపు జూన్ 13వ తేదీతో ముగియనుండటంతో ఆ తర్వాత టిక్కెట్ల రేట్లు సాధారణ స్థితికి రానున్నాయి. రేట్లు తగ్గితే సామాన్య ప్రేక్షకులు భారీ సంఖ్యలో థియేటర్లకు తరలివస్తారని, సినిమా కలెక్షన్లు రూ. 500 కోట్ల వైపు పరుగులు తీయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మార్కెట్లో మరో పెద్ద సినిమా లేకపోవడం కూడా ‘పెద్ది’కి ప్లస్ పాయింట్‌గా మారింది.