
అంబులెన్స్‌లు, అత్యవసర వాహనాలకు మినహాయింపు తిరుపతి: కూటమి ప్రభుత్వం దామినేడులో నిర్వహిస్తున్న బహిరంగ సభ దృష్ట్యా శుక్రవారం తిరుపతిలో ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు
, మళ్లింపులు ఉంటాయని ఎస్పీ సుబ్బరాయుడు ప్రకటించారు. అంబులెన్స్‌లు, ఇతర అత్యవసర వాహనాలకు మినహాయింపు ఉంటుందన్నారు. ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించి పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. చిత్తూరు వైపు నుంచి వచ్చే వాహనాలు.. ఒమేగా హాస్పిటల్, చెర్లోపల్లె, జూపార్క్, గరుడ సర్కిల్, నంది సర్కిల్, లీలామహల్, కరకంబాడి మార్గం ద్వారా ప్రయాణించాలి. మదనపల్లె వైపు నుంచి వచ్చే వాహనాలు.. పీలేరు, రంగంపేట, శ్రీనివాస మంగాపురం, చెర్లోపల్లె, జూపార్క్, గరుడ సర్కిల్, నంది సర్కిల్, ఫ్లైఓవర్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకోవాలి. ఆర్టీసీ బస్టాండ్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే వాహనాలు.. బస్టాండ్ నుంచి ఫ్లైఓవర్ మీదుగా నంది సర్కిల్, గరుడ సర్కిల్, జాపార్క్,చెర్లోపల్లె, ఒమేగా హాస్పిటల్ మీదుగా బెంగళూరు వైపునకు వెళ్లాలి. కడప వైపు నుంచి వచ్చే వాహనాలు.. కట్టపుట్టాలమ్మ దేవాలయం, కరకంబాడి, మంగళం, లీలామహల్ కూడలి మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకోవాలి. నాయుడుపేట వైపు నుంచి వచ్చే వాహనాలు.. నాయుడుపేట - పూతలపట్టు జాతీయ రహదారిపై వాజ్‌పేయి జంక్షన్ నుంచి ఓల్డ్ రేణిగుంట చెక్‌పోస్ట్, రమణ విలాస్ సర్కిల్, కట్టపుట్టాలమ్మ దేవాలయం, కరకంబాడి, మంగళం, లీలామహల్ సర్కిల్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకోవాలి. చెన్నై, పుత్తూరు వైపు నుంచి వచ్చే వాహనాలు.. గాజులమండ్యం సర్కిల్, ఓల్డ్ రేణిగుంట చెక్‌పోస్ట్, నారాయణాద్రి హాస్పిటల్, బ్లిస్ సర్కిల్ మీదుగా తిరుపతి నగరంలోకి ప్రవేశించాలి. అంబులెన్స్‌లు, అత్యవసర వాహనాలిలా.. అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు, ఇతర అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలు ట్రాఫిక్ మళ్లింపులు, మార్గాలను అనుసరించాల్సిన అవసరంలేదు. అవసరమైన మార్గంలో ప్రయాణించవచ్చు. ఈ వార్తలు కూడా చదవండి: జగన్ ‘ఆట’..కట్టు! జగన్‌కు బుర్ర ఉందా..? Read Latest AP News And Telangana News And International News And Telugu News