
మెనోపాజ్ వల్ల కావచ్చు.. జీవనశైలిలో మార్పుల వల్ల కావచ్చు.. ఇలా కారణమేదైనా నలభైల్లోకి అడుగుపెట్టిన మహిళలు వయసుతో పాటు ఉన్నట్లుండి బరువు పెరుగుతుంటారు. శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం, చక్కటి ఆహార
నియమాలు పాటించకపోవడం వల్ల కూడా ఈ వయసులో వివిధ అనారోగ్యాలు చుట్టుముడతాయి.
మెనోపాజ్ వల్ల కావచ్చు.. జీవనశైలిలో మార్పుల వల్ల కావచ్చు.. ఇలా కారణమేదైనా నలభైల్లోకి అడుగుపెట్టిన మహిళలు వయసుతో పాటు ఉన్నట్లుండి బరువు పెరుగుతుంటారు. శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం, చక్కటి ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల కూడా ఈ వయసులో వివిధ అనారోగ్యాలు చుట్టుముడతాయి. మరి, ఇలా జరగకుండా.. ఈ వయసులో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే కొన్ని ఆహార పదార్థాలు రోజువారీ మెనూలో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. మరి, అవేంటో తెలుసుకుందాం..
నలభై దాటాక బరువు అదుపులో ఉంచుకోవాలన్నా, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలన్నా సబ్జా గింజలు మంచి ఆహారమంటున్నారు నిపుణులు. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. గ్లూటెన్ ఉండదు. యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు.. నిండి ఉన్న సబ్జా గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక ఈ గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. తద్వారా ఆహారపు కోరికలు అదుపులో ఉంటాయి. వీటిని నీటిలో నానబెట్టుకుని తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే సలాడ్లు, స్మూతీలలో కలుపుకొని తీసుకున్నా ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.
నారింజ, ద్రాక్ష, నిమ్మ.. వంటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్-సి తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర బరువును అదుపులో ఉంచడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి. అంతేకాదు.. మెదడు పనితీరునూ మెరుగుపరుస్తాయి. గుండెకు రక్షణనిస్తాయి. అలాగే చర్మ ఆరోగ్యానికీ ఈ పోషకాలు ఎంతో మంచివంటున్నారు నిపుణులు.
మెనోపాజ్‌కు దగ్గరవుతోన్న మహిళల్లో ఐరన్, విటమిన్-డి స్థాయులు క్రమంగా తగ్గిపోతుంటాయి. ఇలాంటప్పుడు ఈ రెండు పోషకాలు పుష్కలంగా లభించే కోడిగుడ్లు తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. వీటి వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందంటున్నారు. అదేవిధంగా గుడ్లలోని ప్రొటీన్లు మెనోపాజ్ కారణంగా స్త్రీలలో పెరిగే చెడు కొవ్వును కరిగించడంలో సహకరిస్తాయంటున్నారు నిపుణులు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.