
గతేడాది ఎఫ్1 అనే సినిమాతో అదిరిపోయే విజయాన్ని దక్కించుకున్న టాప్‌స్టార్ బ్రాడ్ పిట్ (Brad Pitt) మరోసారి ప్రేక్షకులను అలరించేదుకు సిద్ధమయ్యాడు. గతేడాది ఎఫ్1 అనే సినిమాతో అదిరిపోయే
విజయాన్ని దక్కించుకున్న టాప్‌స్టార్ బ్రాడ్ పిట్ (Brad Pitt) మరోసారి ప్రేక్షకులను అలరించేదుకు సిద్ధమయ్యాడు. ఆయన హీరోగా నటించిన కొత్త మూవీ హార్ట్ ఆఫ్ ది బీస్ట్ (Heart of the Beast) ట్రైలర్ విడుదలైంది.
జె. కె. సిమన్స్ (J. K. Simmons), అన్నా లాంబే (Anna Lambe), ఉబేర్ (డాగ్) కీలక పాత్రల్లో నటించగా ఫాస్ట్ అండ్ పూరియస్, ఫ్యూరీ, సూసైడ్ స్క్వాడ్ చిత్రాల డైరెక్టర్ డేవిడ్ అయర్ (David Ayer) దర్శకత్వం వహించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ఎదుటకు రానుంది.
ఈ నేపథ్యంలో గురువారం విడుదల చేసినట్రైలర్ బ్రాడ్ పిట్ అభిమానులను, ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మిలటరీ ఆఫీసర్ తన రిటైర్మెంట్ అనంతరం తనతో పాటు ఆర్మీలో పని చేసి కాలు పొగొట్టుకున్న కుక్కతో విహార యాత్ర చేస్తుండగా హెలికాప్టర్ అలస్కా భీకర అరణ్యంలో కూలిపోతుంది.
ఈ క్రమంలో హీరో, ఆ కుక్క అక్కడి ప్రతికూల వాతావరణం, పరిసరాలను అధిగమించి ఎలా తిరిగి జన సంచారంలోకి తిరిగి వచ్చారు, ఎలాంటి కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నారు అనే ఆసక్తికరమైన కథకథనాలతో సినిమా తెరకెక్కించారు.
తాజాగా విడుదల చేసిన ట్రైలర్ సైతం సినిమా ఎప్పుడు చూద్దామా అనేలా ఆసక్తికరంగా సాగింది. వారి సర్వైవల్ కోసం ఎలా పోరాడారనే సన్నివేశాలు కూర్చో బెట్టేలా మంచి థ్రిల్లింగ్ సీన్లతో రూపొందించినట్లు అర్థమవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే మీరు ఆ ట్రైలర్ చూసేయండి.