
ప్రస్తుతం మార్కెట్లో వస్తున్న ఆధునిక టీవీలు అద్భుతమైన పిక్చర్ క్వాలిటీతో కళ్లకు విందు చేస్తున్నాయి. అయితే, డిజైన్‌లో భాగంగా చాలా సన్నగా ఉండటంతో వాటిలో అమర్చే స్పీకర్లు నాసిరకంగా ఉంటున్నాయి. దీంతో
సినిమా చూస్తున్నా, స్పోర్ట్స్ ఆస్వాదిస్తున్నా సౌండ్ విషయంలో ఏదో ఒక అసంతృప్తి వెంటాడుతూనే ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇంట్లో కూర్చుని ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసేటప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువగా తెలుస్తుంది. ఈ సమస్యకు సరైన పరిష్కారమే సౌండ్‌బార్. ఇది మీ టీవీ సౌండ్‌ను గణనీయంగా మెరుగుపరిచి, ఇంట్లోనే సినిమా థియేటర్ అనుభూతిని అందిస్తుంది. ఈ నేపథ్యంలో, ప్రముఖ వార్తా సంస్థ న్యూస్18, సౌండ్‌బార్ కొనుగోలుపై ఒక సమగ్ర గైడ్‌ను ప్రచురించింది.ఏ సౌండ్‌బార్ కొనాలి? ఛానెల్స్ అంటే ఏమిటి?సౌండ్‌బార్ కొనేటప్పుడు మనం తరచుగా 2.1, 3.1, 5.1.2 వంటి నంబర్లను చూస్తుంటాం. ఇవి స్పీకర్ల సంఖ్యను, వాటి అమరికను సూచిస్తాయి.2.1 ఛానెల్: ఇది బేసిక్ అప్‌గ్రేడ్. ఇందులో రెండు స్పీకర్లు, ఒక సబ్ వూఫర్ ఉంటాయి. సాధారణ టీవీ సౌండ్ కంటే మెరుగైన ఆడియో, మంచి బాస్ అందిస్తుంది.3.1 ఛానెల్: ఇందులో అదనంగా ఒక సెంటర్ ఛానెల్ ఉంటుంది. సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు భారీగా ఉన్నప్పుడు కూడా మాటలు (డైలాగ్స్) స్పష్టంగా వినపడటానికి ఇది చాలా సహాయపడుతుంది.5.1.2+ ఛానెల్: ఇక్కడి నుంచే అసలైన డాల్బీ అట్మోస్ అనుభవం మొదలవుతుంది. ఐదు స్పీకర్లు, ఒక సబ్ వూఫర్‌తో పాటు, పైనుంచి వచ్చే శబ్దాలను (height effects) అందించడానికి రెండు అదనపు స్పీకర్లు ఉంటాయి. ఉదాహరణకు, వర్షం పడుతున్నప్పుడు