
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు
. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Bhairavi Arthya Interview: అస్సాం నుంచి వచ్చి తెలుగు భాష నేర్చుకుని, కొనసీమ అమ్మాయి పాత్రలో యాక్ట్ చేసిన చిత్రం ‘కొత్త మలుపు’. తన సినీ ప్రయాణం, సినిమా విశేషాలు, భవిష్యత్ లక్ష్యాల గురించి ఈ చిట్‌చాట్‌లో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.
నేపథ్యం .. అస్సాం నుంచి టాలీవుడ్ వరకు ప్రయాణం.. నేను అస్సాంకు చెందిన అమ్మాయిని. మా కుటుంబ సభ్యులు అక్కడే ఉంటారు. చిన్నప్పటి నుంచే సినిమాలు, నటన అంటే చాలా ఇష్టం. తెలుగు సినిమాలు కూడా చూస్తూ పెరిగిన నేను ఒక రోజు నటిగా మారాలనే కల కన్నాను. ఆ లక్ష్యంగా అడుగులు వేయడంతో తన కల నిజమైంది.
నా చదువుతో పాటు ఆడిషన్స్ ఇవ్వడం మొదలుపెట్టాను. అప్పట్లో నాకు తెలుగు అస్సలు రాదు. అయినప్పటికీ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. దాదాపు రెండు మూడేళ్లు ఆడిషన్స్ ఇస్తూ, తెలుగును నేర్చుకునేందుకు ప్రత్యేకంగా ప్రయత్నించాను. చుట్టుపక్కల వాళ్లతో తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నిస్తూ భాషపై పట్టు సాధించాను. ఆ కృషి ఫలితమే ఈ సినిమాలో ఛాన్స్.
ఈ చిత్రంలో నా పాత్ర పేరు వరలక్ష్మి. కొనసీమకు చెందిన అమాయకమైన గ్రామీణ యువతి. చాలా స్వేచ్ఛగా, మనసుకు నచ్చినట్టు జీవించే అమ్మాయి. సహజత్వానికి దగ్గరగా ఉండే గ్లామరస్ రోల్. నటిగా నాకు మంచి అవకాశాన్ని ఇచ్చిన క్యారెక్టర్.
కొనసీమ ప్రకృతి అందాలు నన్ను చాలా ఆకట్టుకున్నాయి. కొబ్బరి తోటలు, అక్కడి సంస్కృతి, ఆహారం అన్నీ నాకు కొత్త అనుభవం. అస్సాంలోని మా జీవన శైలి వేరు ఇక్కడి కొనసీమ లైఫ్‌స్టైల్ వేరుగా ఉంటాయి. అందుకే షూటింగ్ ప్రారంభానికి ముందు నెల రోజుల పాటు అక్కడే ఉండి స్థానికుల జీవనశైలి, డ్రెస్సింగ్, బాడీ లాంగ్వేజ్, యాస అన్నింటినీ పరిశీలించి నేర్చుకున్నాను.
ఈ సినిమాలో మీకు ఎదురైన ప్రధాన సవాళ్లు.. భాషే పెద్ద సవాలు. తెలుగు నేర్చుకున్నప్పటికీ గోదావరి ప్రాంత యాసను పట్టుకోవడం అంత ఈజీ కాదు. అలాగే వర్షాకాలంలో షూటింగ్ జరగడంతో వాతావరణ పరిస్థితులు కూడా కొంత ఇబ్బంది పెట్టాయి. అయితే టీమ్ అందరి సహకారంతో ఆ సవాళ్లను అధిగమించగలిగాను.
దర్శకుడు, హీరో నుంచి సహకారం.. దర్శకుడు శివ వరప్రసాద్ చాలా ఓపికగా ప్రతి సన్నివేశాన్ని వివరించేవారు. ఏ డైలాగ్ అర్థం కాకపోయినా సులభంగా చెప్పి యాక్ట్ చేయడానికి సహాయపడ్డారు. హీరో ఆకాష్ కూడా ఎంతో సహకరించారు. కొత్త వ్యక్తినైనా ఎక్కడా అసౌకర్యంగా అనిపించలేదు. వీరందరి సహకారంతో నేను ఈ సినిమా బెటర్‌గా చేయగలిగాను అని చెప్పగలను.
తెలుగు సినీ పరిశ్రమ గురించి మీ అభిప్రాయం?
నేను స్కూల్ రోజుల నుంచే తెలుగు సినిమాలకు అభిమానిని. ముఖ్యంగా ఇక్కడి కథలు, భావోద్వేగాలు చాలా బాగుంటాయి. హైదరాబాద్‌లోని నటరంగ్ థియేటర్లో ఆరు నెలల పాటు యాక్టింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్నాను.
హీరోల్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు చాలా ఇష్టం. హీరోయిన్లలో రష్మిక మందనా, సమంతని ఎంతో అభిమానిస్తాను.
హైదరాబాద్ అంటే ముందుగా గుర్తొచ్చేది చికెన్ దమ్ బిర్యానీ. నాకు చాలా ఇష్టం. నగర వాతావరణం, ఇక్కడి ప్రజల ఆతిథ్యం కూడా బాగా నచ్చాయి.
‘కొత్త మలుపు’ సినిమా చూసారా? ఎలా అనిపించింది?
భైరవి: అవును. నేను ఇప్పటికే మూడు సార్లు సినిమా చూశాను. చాలా బాగా వచ్చింది. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్.. వినోదం, కామెడీ, సస్పెన్స్ అన్నీ ఉన్నాయి. ప్రతి వర్గం ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే అంశాలున్నాయి. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాను.
భైరవి: ఖచ్చితంగా ఉంది. నాకు మంచి కథ, మంచి పాత్ర. అది సినిమా అయినా, ఓటీటీ ప్రాజెక్ట్ అయినా నేను సిద్ధమే. గ్లామర్ ఒక హీరోయిన్‌కు అవసరమే. కానీ అది మాత్రమే సరిపోదు. నటన, పాత్రల ఎంపిక, ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రదర్శన కూడా అంతే ఇంపార్టెంట్. మంచి సినిమాలు చేస్తూ నటిగా గుర్తింపు పొందాలని కోరుకుంటున్నాను.
చివరగా..తెలుగు ప్రేక్షకులు నాకు ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. అందరి ఆశీర్వాదాలు, ప్రేమ ఎప్పుడూ ఉండాలి. ‘కొత్త మలుపు’ సినిమాను థియేటర్లలో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.