
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు
. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Isakapatnam Streaming On Amazon Prime Video: ప్రైమ్ వీడియో తన అత్యంత ఇంట్రెస్టింగ్ తెలుగు ఒరిజినల్ సిరీస్‘ఇసాకపట్నం’ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. గ్యారీబీహెచ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ ఏడు ఎపిసోడ్ల యాక్షన్ థ్రిల్లర్ జూలై 2 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రైమ్ వీడియో లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఓటీటీ వేదికల్లో ప్రైమ్ వీడియోకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ ప్రతిష్టాత్మక తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘ఇసాకపట్నం’ వరల్డ్ వైడ్‌గా ప్రీమియర్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ప్రతీకారం, అధికారం, కుటుంబ రాజకీయాలు, గ్యాంగ్ వార్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ జూలై 2 నుంచిప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్కు రానుంది.
గ్యారీ బీహెచ్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్‌కు ప్రశాంత్ రాఘతికథా రచన అందించారు. తాజుద్దీన్ సయ్యద్ మాటలు రాశారు. తమడా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాహుల్ తమడా, సైదీప్ రెడ్డిబొర్రా నిర్మించారు.
ఒక కల్పిత పోర్ట్ టౌన్ నేపథ్యంలో సాగే ‘ఇసాకపట్నం’ కథలో అధికారం కోసం జరిగే పోరాటాలు, ఫ్యామిలీ డ్రామా, రాజకీయ కుట్రలు, గ్యాంగ్‌స్టర్ సంఘర్షణలు మెయిన్ అట్రాక్షన్‌గా ఉండనున్నాయి. ఈ సిరీస్‌లో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్‌లో యాక్ట్ చేశారు. సునీల్, నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమకుల, రాజీవ్‌కనకాల, మైమ్ గోపి, రోహిణి, బెనర్జీ, జ్వాలా కోటి, రవివర్మ, రాజాచెంబోలు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.
ఈ సందర్భంగా ప్రైమ్ వీడియో ఇండియా ఒరిజినల్స్ హెడ్ నిఖిల్ మధోక్ మాట్లాడుతూ.. దక్షిణ భారతీయ కథలతో ఇప్పటికే విభిన్నమైన ఒరిజినల్స్‌ను ప్రేక్షకులకు అందిస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడు‘ఇసాకపట్నం’ ద్వారా మరొక శక్తివంతమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాము. ప్రతీకారంతో పాటు భావోద్వేగాలు, అనూహ్య మలుపులు నిండిన ఈ సిరీస్ ఆడియన్స్‌ను పూర్తిగా ఆకట్టుకుంటుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ అద్భుత నటనతో పాటుగ్యారీ బీహెచ్ దర్శకత్వం ఈ కథకు బలం అన్నారు.
నిర్మాతలు రాహుల్ తమడా, సందీప్ రెడ్డి బొర్రా మాట్లాడుతూ,*“‘ఇసాకపట్నం’ ఒక రివెంజ్ థ్రిల్లర్ మాత్రమే కాదు. విశ్వాసం, కుటుంబ విభేదాలు, రాజకీయ ఆధిపత్య పోరాటం వంటి అంశాల నేపథ్యంలో పూర్తి భావోద్వేగంగా మిళితంగా తెరకెక్కిన కథ అని చెప్పుకొచ్చారు. ఒక పోర్ట్ టౌన్ ప్రపంచాన్ని అత్యంత నాచురల్‌గా తెరపై ఆవిష్కరించడానికి మా బృందం ఎంతో కృషి చేసిందన్నారు. ఈ కథను ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులముందుకు తీసుకురావడంలో ప్రైమ్ వీడియో లో కలిసి పనిచేయడం హ్యాపీగా ఉందన్నారు.
తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో డబ్బింగ్ వెర్షన్, అలాగే ఇంగ్లీష్ సహా 15 భాషల్లో సబ్‌టైటిల్స్‌తో ‘ఇసాకపట్నం’ జూలై 2 నుంచి భారతదేశంతో పాటు 240కి పైగా దేశాల్లో వివిధ ప్రాంతాల్లోప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే, ప్రైమ్ డే సందర్భంగా ప్రైమ్ వీడియో అందిస్తున్న ప్రత్యేక కంటెంట్ లైనప్‌లో ‘ఇసాకపట్నం’ కూడా ఒక మెయిన్ అట్రాక్షన్‌గా నిలవనున్నట్టు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.