
AP School Holidays List 2026-27: ఆంధ్రప్రదేశ్‌లో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం కావడానికి సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో, విద్యాశాఖ 2026-27 విద్యా సంవత్సరానికి (Academic Calendar)
సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేసింది.
ఈ ఏడాది విద్యార్థులకు పండుగ సెలవులతో పాటు పరీక్షల తేదీలను కూడా ముందే ఖరారు చేశారు. ఈ కొత్త అకడమిక్ ఇయర్లో మొత్తం 229 పనిదినాలు ఉండగా.. ఆదివారాలు, ఇతర పండుగలతో కలిపి మొత్తం 87 రోజులు సెలవులు రానున్నాయి.
విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే దసరా, క్రిస్మస్, సంక్రాంతి సెలవుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. దసరా సెలవులను అక్టోబర్ 12 నుండి అక్టోబర్ 21 వరకు ఉండగా.. క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 20 నుండి డిసెంబర్ 27 వరకు నిర్ణయించారు.
అలాగే అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సంక్రాంతి సెలవులు 2027 జనవరి 11 నుండి జనవరి 17 వరకు ఇచ్చేందుకు ప్లానింగ్‌లో ఉంది.
ప్రతి శనివారం 'నో బ్యాగ్ డే' విద్యార్థులపై పుస్తకాల భారాన్ని తగ్గించి, సృజనాత్మకతను పెంచేందుకు ఈ విద్యాసంవత్సరంలోనూ ప్రతి శనివారం బ్యాగ్ లేకుండానే స్కూలుకు వెళ్లేలా 'నో బ్యాగ్ డే'ని కొనసాగించనున్నారు.
పదో తరగతి (10th Class) బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ ముందే ప్రకటించింది. 2027 మార్చి 15 నుండి మార్చి 31 వరకు టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి.
పాఠశాలలు రేపటి నుంచే ప్రారంభం కానుండటంతో విద్యాసంస్థలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. కొత్త పుస్తకాల పంపిణీ, తరగతి గదుల సిద్ధం చేయడం వంటి పనులు పూర్తయ్యాయి.