
Bharathiraja Funeral : భారతీయ చలనచిత్ర రంగానికి, ముఖ్యంగా తమిళ సినిమాకు సరికొత్త నడకను, నడకను నేర్పిన లెజెండరీ దర్శకుడు, నటుడు భారతీరాజా (84) అంతిమ సంస్కారాలు ముగిశాయి. నిన్న ఆయన కన్నుమూసిన సంగతి
తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని చెన్నైలోని నివాసంలో ఉంచినప్పుడు సినీ, రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు తరలివచ్చి కన్నీటి నివాళులు అర్పించారు. చిత్రసీమలో ఒక శకానికి ముగింపు పలికిన ఆయన భౌతికకాయాన్ని చూసి సహచర నటీనటులు, సాంకేతిక నిపుణులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. గ్రామీణ నేపథ్య కథలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన ఈ మహానుభావుడి మృతి సినీ రంగానికి తీరని లోటని పలువురు కొనియాడారు.
Read Also : ‘పెద్ది’ సక్సెస్.. బన్నీ పోస్ట్‌పై రామ్ చరణ్ క్రేజీ రిప్లై!
చెన్నైలో నివాళుల అనంతరం, భారతీరాజా పార్థివదేహాన్ని ఆయన స్వస్థలమైన దిండిగల్ జిల్లా, వత్తలగుండు ఘాట్‌రోడ్డులోని స్వంత వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. తన మట్టిని, గ్రామీణ సంస్కృతిని అమితంగా ప్రేమించే ఆయన చివరి కోరిక మేరకు అక్కడే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. తమ ప్రియతమ దర్శకుడిని చివరిసారి చూసేందుకు వత్తలగుండుకు వేలాదిగా అభిమానులు, స్థానిక ప్రజలు తరలివచ్చారు. చలనచిత్ర రంగానికి ఆయన చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించింది. పోలీసుల గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించిన అనంతరం, కుటుంబ సభ్యులు శాస్త్రోక్తంగా ఆయనకు తుది వీడ్కోలు పలికారు.
Private School Fees : ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ నెంబర్ కు కాల్ చేయండి!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
PM Modi condoles Bharathiraja: భారతీరాజా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం!
Radhika emotional post: నా జీవితంలో రెండు స్తంభాలను కోల్పోయాను.. రాధికా శరత్‌కుమార్
Peddi Ticket Issue : హైకోర్టు కు చేరిన ‘పెద్ది’ టికెట్ పెంపు వ్యవహారం !
Nandamuri Balakrishna Birthday: బసవతారకం ఆసుపత్రిలో బాలయ్య బర్త్‌డే సెలబ్రేషన్స్
June 2026 Telugu Movie Releases: జూన్ నెలలో థియేటర్లను షేక్ చేయనున్న ఆసక్తికర చిత్రాలివే!
Alpha Teaser: ‘ఆల్ఫా’ టీజర్‌పై షారుఖ్ ఖాన్ క్రేజీ పోస్ట్!