
Madhya Pradesh Rajya Sabha Seats : మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షీ నటరాజన్ నామినేషన్ సాంకేతిక కారణాలతో తిరస్కరణకు
గురికావడంతో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ పరిణామంతో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు గానూ ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి (RO) అధికారికంగా ప్రకటించారు. బీజేపీ తరఫున బరిలో నిలిచిన సీనియర్ నేతలు తరుణ్ చుగ్, రజనీశ్ అగర్వాల్, మరియు మహేశ్ కేవత్లను విజేతలుగా ప్రకటిస్తూ, వారికి ఎన్నికల ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఒక స్థానాన్ని దక్కించుకోవాలని భావించిన కాంగ్రెస్ వ్యూహం నామినేషన్ల తిరస్కరణతో పూర్తిగా తలకిందులైంది.
Read Also : కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం?! సోనియా గాంధీ బంపర్ ఆఫర్?
తమ అభ్యర్థి మీనాక్షీ నటరాజన్ నామినేషన్‌ను ఉద్దేశపూర్వకంగానే తిరస్కరించారంటూ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అధికార బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి వల్లే ఎన్నికల అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపిస్తూ నిరసనకు దిగింది. ఈ అన్యాయమైన తిరస్కరణను నిరసిస్తూ, ప్రజాస్వామ్య రక్షణ కోసం మధ్యప్రదేశ్‌కు చెందిన 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేపు న్యూఢిల్లీలో భారత రాష్ట్రపతిని కలవనున్నారు. రాష్ట్రపతికి నేరుగా ఫిర్యాదు చేసి, ఈ ఎన్నికల ప్రక్రియపై న్యాయం చేయాలని కోరాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఈ పరిణామాలతో మధ్యప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా దేశ రాజధానికి చేరి తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి.
Bharathiraja : ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు పూర్తి
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
TMC Merger with Congress : TMC విలీనం వార్తలపై కాంగ్రెస్ క్లారిటీ
ICAR-NAARM: ప్రధాని ప్రతిష్ఠాత్మక పరిశోధన గ్రాంట్‌ను కైవసం చేసుకున్న ఐకార్-నార్మ్ శాస్త్రవేత్త
India first bullet train: త్వరలో పట్టాలెక్కనున్న తొలి బుల్లెట్ రైలు.. రైల్వే మంత్రి ప్రకటన!
TMC-Congress : కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం?! సోనియా గాంధీ బంపర్ ఆఫర్?
Meenakshi Natarajan nomination: మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై మహేష్ కుమార్ గౌడ్ స్పందన
RBI new rules: NIRలకు గుడ్ న్యూస్.. ఎఫ్సీఎన్ఆర్ డిపాజిట్లపై భారీగా పెరిగిన వడ్డీ రేట్లు!