
జ్యోతిష్యశాస్త్రంలో కుబేరుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే పన్నెండు రాశులలో నాలుగు రాశుల వారిపై కుబేరుడి అనుగ్రహం ఉంటుందంట. సంపద పెరగడమే కాకుండా, అన్ని విధాలుగా కలిసి వస్తుందంట. కాగా, ఆ రాశులు
ఏవి అంటే?
మీన రాశి :మీన రాశి వారికి కుబేరుడి అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే, ఈ రాశివారికి డబ్బులోటు అనేది ఎప్పుడూ ఉండదు. వీరు చాలా చిన్న వయసులోనే ధనవంతులు అవుతారు. కుబేరుడి ఆశీస్సులతో వారికి అన్ని సుఖాలు లభిస్తాయి.
మకర రాశి : మకర రాశి వారికి ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంటుంది. కుబేరుడి ఆశీర్వాదం కారణంగా వీరు కోరుకున్న సకల సౌఖ్యాలన్నీ మీ సొంతం అవుతాయి. అలాగే వీరికి డబ్బుకు కొదవే ఉండదు. ఈ రాశి వారు చాలా తొందరగా, జీవితంలో స్థిరపడతారు. డబ్బు ఎక్కువగా పొదుపు చేస్తారు.
మిథున రాశి : మిథున రాశి వారిపై కుబేరుడి చల్లని చూపు ఉంటుంది.ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటారో వారికి ఇది మంచి సమయం. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.
మేష రాశి : మేష రాశి వారికి ఎప్పుడూ అప్పుల బాధలే ఉండవు. వీరికి డబ్బుకు ఎక్కువగా లోటు ఉండదు. కుబేరుడి అనుగ్రహం మేష రాశి వారి పై అధికంగా ఉండటం వలన అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వ్యాపారాల్లో, ఆర్థిక వ్యవహారాల్లో అన్నింట్లో వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది.ఎప్పుడూ ఆదాయం డబుల్ అవుతూనే వస్తుంది.