
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన ఓ వరుడు తన పెళ్లికి బుల్డోజర్పై రావాలని వింత నిర్ణయం తీసుకున్నాడు. బరాత్ సమయంలో బుల్డోజర్పై కూర్చొని పొగ తాగుతూ, డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాడు. అతని
Jun 11 2026 8:46 PM | Updated on Jun 11 2026 8:55 PM
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన ఓ వరుడు తన పెళ్లికి బుల్డోజర్పై రావాలని వింత నిర్ణయం తీసుకున్నాడు. బరాత్ సమయంలో బుల్డోజర్పై కూర్చొని పొగ తాగుతూ, డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాడు. అతని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ఉమ్రీ కలా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వరుడు ఉస్మాన్ గ్రామంలో పెళ్లి ఊరేగింపునకు సంప్రదాయంగా గుర్రం లేదా కారు బదులు బుల్డోజర్ను వాడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అందరికంటే ప్రత్యేకంగా తన బరాత్ చేసుకోవాలని అనుకున్నాడు.
వైరల్ వీడియోలో ఉన్న దారి ప్రకారం ఉస్మాన్ తన స్నేహితులతో కలిసి బుల్డోజర్పై కూర్చొని గ్రామంలో ఊరేగింపులో పాల్గొంటూ కనిపించాడు. ఒక వీడియోలో అతను సిగరెట్ తాగుతూ పొగ రింగు రింగులుగా వదులుతూ వెళ్లిన దృశ్యాలు కనిపించాయి.
మరో వీడియోలో పెద్ద శబ్దంతో వినిపించిన డీజే సంగీతానికి అనుగుణంగా బుల్డోజర్పై ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తుండగా పెళ్లి అతిథులు అతడిని ప్రోత్సహిస్తూ కనిపించారు. వేడుకల సమయంలో మరికొందరు బరాత్ సభ్యులు కూడా బుల్డోజర్పైకి ఎక్కినట్లు వీడియోల్లో కనిపించింది. కదులుతున్న బుల్డోజర్పై డజన్‌కు పైగా అతిథులు నిలబడి డ్యాన్స్ చేస్తూ హ్యాపీగా గడిపారు.
ఈ విభిన్న పెళ్లి ఊరేగింపును కొందరు నెటిజన్లు వినోదాత్మకంగా భావించినా, మరికొందరు భద్రతాపరమైన ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేశారు. రద్దీగా ఉన్న ఊరేగింపులో బుల్డోజర్పై డ్యాన్స్ చేయడం ప్రమాదాలకు దారి తీయవచ్చని అభిప్రాయపడ్డారు.
వీడియోలు మరింత వైరల్ అవుతుండడంతో స్థానిక అధికారులు ఈ విషయాన్ని గమనించారు. వీడియోల్లో కనిపించిన బుల్డోజర్ను గుర్తించామని, దానిపై చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.
ఈ విషయంపై మాట్లాడిన కాంత్ పోలీస్ స్టేషన్ అధికారులు.. ఊరేగింపులో వినియోగించిన జేసీబీ యంత్రాన్ని గుర్తించామని, చలాన్ జారీ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. అయితే భారీ యంత్రాలు, ప్రమాదకర విన్యాసాలు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనతో జరిగే వేడుకలు చట్టపరమైన చర్యలకు దారి తీస్తాయని, ముఖ్యంగా ప్రజల భద్రత ప్రమాదంలో పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు పలుమార్లు హెచ్చరించారు.
ఉస్మాన్ పెళ్లి బృందం సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షించడంలో విజయవంతమైనా, పెళ్లి తర్వాత ఊహించని గుర్తుగా ట్రాఫిక్ చలాన్‌ను కూడా పొందింది.
ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో నమ్రతా, మంచు లక్ష్మీ సందడి (ఫోటోలు)
పింక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న నభా నటేశ్..ఫోటోలు
శివ హీరోయిన్.. ఈ ప్రేమ జంట పెళ్లి బంధానికి 33 ఏళ్లు..! (ఫోటోలు)
విజయవాడలో కుండపోత వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫోటోలు)
ట్రెండింగ్ లో హెబ్బా పటేల్ బ్యూటిఫుల్ ఫోటోలు
కన్నీటి ఆవేదన! ప్రాణాలు తీసుకుంటానని హెచ్చరిక..
నీ కొడుకు చేసిన పనికి నువ్వు బలి అవ్వడం ఖాయం..!
ఆ రోజు కార్మిక సంఘాలు లేకపోతే వైజాగ్ లో అడుగు పెట్టేవాడివా?
ఏపీకి రెయిన్ అలర్ట్...! ఆ జిల్లాలో భారీ వర్షాలు
బుడోడు కోసం శ్రీలంకలో ఎగబడుతున్న ఫ్యాన్స్..