
ఇంటర్నెట్ డెస్క్: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటన, పవర్ఫుల్ డైలాగులతో బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్న నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) పుట్టినరోజు వేడుకలను షార్లెట్‌లో ఆయన అభిమానులు ఘనంగా
నిర్వహించారు. కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. వయసనేది కేవలం ఒక నంబర్ మాత్రమే అని నిరూపిస్తూ, ఐదు దశాబ్దాలుగా వెండితెరపై రారాజులా వెలుగుతున్న బాలయ్య.. నేటికీ అదే జోష్‌తో కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్నారని అభిమానులు పేర్కొన్నారు. ‘అఖండ’తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన బాలకృష్ణ, వరుసగా రూ.వంద కోట్ల క్లబ్ సినిమాలతో మూడు తరాల ప్రేక్షకులను అలరిస్తున్నారని చెప్పారు. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని రీరిలీజ్ చేసిన ‘సమరసింహారెడ్డి’ సినిమాను అభిమానులంతా చూసి థియేటర్ వద్ద హంగామా చేశారు. ఈ వేడుకల్లో బాలయ్య అభిమానులు, తెదేపా అభిమానులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.