
అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా
సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Soori And Suhas Mandaadi Locks Release Date: సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో సినిమాపై మంచి ఆసక్తిని కలిగించారు. ఈ సినిమాపై అటు కోలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ అంచనాలు అమాంతం పెరిగాయి. తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో సాగే ఈ మూవీలో సూరి, సుహాస్ ఇద్దరూ కూడా రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇక ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాని ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ నిర్మిస్తోంది. మదిమారన్ పుగళేంది తెరకెక్కిస్తున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఆల్రెడీ పూర్తయింది.
రియల్ లొకేషన్స్‌లో ఎంతో శ్రమించి ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్, ఒళ్లుగగుర్పొడిచే సెయిల్‌బోట్ రేస్ సీక్వెన్స్‌ను షూట్ చేశారు. దాదాపు 80 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాని సెప్టెంబర్ 4న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మేరకు రిలీజ్ డేట్ పోస్టర్‌ను తాజాగా రివీల్ చేశారు. ఈ రిలీజ్ డేట్ పోస్టర్లో సుహాస్, సూరి ఎదురెదురుగా నిల్చుని కనిపిస్తున్నారు. ఈ మూవీలో ఈ ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉండబోతోన్నాయని సమాచారం.
ఈ మూవీలో మహిమా నంబియార్ హీరోయిన్గా నటించగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ అందించగా.. ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్‌ను డి.ఆర్.కె. కిరణ్, ఎడిటింగ్‌ను ప్రదీప్ ఇ. రాఘవ్, యాక్షన్ సన్నివేశాలకు పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేశారు. చిత్ర బృందం ఎడిటింగ్, సౌండ్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్, సంగీతం వంటి పోస్ట్-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది.
క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సూరి, సుహాస్ మార్కెట్‌ను, వారి స్థాయిని పెంచేలా ఈ సినిమా ఉంటుంది. ఇక మున్ముందు మరిన్ని ప్రమోషనల్ అప్డేట్లతో ‘మండాడి’ సినిమాపై అంచనాలు పెంచనున్నారు. సెప్టెంబర్ 4న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.
నటీనటులు: సూరి, సుహాస్, మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు. సాంకేతిక బృందం: బ్యానర్ : ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ సమర్ఫణ : ఎల్రెడ్ కుమార్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వెట్రిమారన్ నిర్మాత : ఎల్రెడ్ కుమార్ సహ నిర్మాత : మణికందన్ దర్శకుడు : మదిమారన్ పుగళేంది సంగీతం : జి.వి. ప్రకాష్ కుమార్ కెమెరామెన్ : ఎస్.ఆర్. కథిర్ ఎడిటింగ్ : ప్రదీప్ ఇ. రాఘవ్ యాక్షన్ : పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ ప్రొడక్షన్ డిజైన్ : డి.ఆర్.కె. కిరణ్ పీఆర్వో : సాయి సతీష్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.