
ఓటీటీలో అన్ని రకాల కంటెంట్ ఉంటుంది. లవ్, కామెడీ, యాక్షన్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, హారర్.. ఇలా అన్ని జానర్లకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ అంటే
సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలదే అని చెప్పుకోవచ్చు. భాషతో సంబంధం లేకుండా ఈ క్రైమ్ సినిమాలను చూసేస్తున్నారు ఆడియెన్స్. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా వివిధ భాషల్లో హిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లను ఆయా భాషల్లోకి అనువాదం చేసి మరీ ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా విషయానికి వస్తే. .ఇదొక మలయాళం క్రైమ్ థ్రిల్లర్. ఓటీటీలో తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ ఓటీటీలోనూ భారీ వ్యూయర్ షిప్ సాధించింది. ఏకంగా 100 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ సినిమా కథ చూడడానికి చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ స్క్రీన్ ప్లే, మధ్యలో వచ్చే ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ ఇస్తాయి. ఈ కథ క్రిస్టో జేవియర్ అనే పోలీస్ అధికారి చుట్టూ తిరుగుతుంది. అతను కేవలం తన విధులను నిర్వర్తించడమే కాకుండా, తన స్టేషన్లోనే పిల్లలకు ఉచితంగా జీవిత పాఠాలు చెబుతుంటాడు. ఇదే సమయంలో తన ట్యూషన్‌కు వచ్చే ఒక అమ్మాయికి జరిగిన గొడవ కారణంగా ఆమె సోదరుడు కనిపించకుండా పోతాడు. ఈ మిస్సింగ్ కేసును ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో ఒక ఊహించని మర్డర్ కేసు వెలుగులోకి వస్తుంది. దీంతో క్రిస్టో జేవియర్ డైలమాలో పడిపోతాడు.
మరి మర్డర్ కేసుతో అదృశ్యమైన యువకుడికి ఉన్న సంబంధం ఏమిటి?అసలు హత్య వెనక ఉన్నదెవరు? యువకుడిని ఎవరు కిడ్నాప్ చేశారు? క్రిస్టో ఈ కేసులను ఎలా సాల్వ్ చేశాడన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. కేవలం సినిమాగానే కాకుండా సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చే ఈ మూవీ పేరు సూత్ర వాక్యం. తెలుగు ఆడియెన్స్ కు బాగా పరిచయమైన షైన్ టామ్ చాకో ఇందులో కీలక పాత్ర పోషించాడు. యుజియన్ జోస్ చిరమ్మల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. షైన్ చాకోతో పాటుగా విస్సీ అలోషియస్, దీపక్ పరంబోర్ కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుత సూత్ర వాక్యం సినిమా తెలుగు వెర్షన్ ఈటీవీ విన్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు ఇతర భాషల్లో చూడాలనుకునేవారు లయన్స్ గేట్ ప్లే, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి