
టీ20 ముంబై లీగ్‌లో భారత టీ20 ప్లేయర్ శివమ్ దూబే శివాలెత్తిపోయాడు. ఈ టోర్నీలో అంధేరి ఆర్క్స్‌కు సారథ్యం వహిస్తున్న అతడు.. ఆకాశ్ టైగర్స్‌తో ఇవాళ (జూన్ 11) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆల్‌రౌండ్
Jun 11 2026 7:26 PM | Updated on Jun 11 2026 7:39 PM
టీ20 ముంబై లీగ్‌లో భారత టీ20 ప్లేయర్ శివమ్ దూబే శివాలెత్తిపోయాడు. ఈ టోర్నీలో అంధేరి ఆర్క్స్‌కు సారథ్యం వహిస్తున్న అతడు.. ఆకాశ్ టైగర్స్‌తో ఇవాళ (జూన్ 11) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. ఫలితంగా అతడి జట్టు ఫైనల్‌కు దూసుకుపోయింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బంతితో (3-0-16-1) రాణించిన దూబే.. ఆతర్వాత బ్యాటింగ్‌లో చెలరేగిపోయాడు. ప్రత్యర్ది నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. 26 బంతుల్లో ఓ బౌండరీ, 5 సిక్సర్లతో విరుచుకుపడి అజేయమైన 45 పరుగులు చేశాడు.
తద్వారా అతడి జట్టు మరో 9 బంతులు మిడిలుండగానే విజయతీరాలకు చేరింది. లక్ష్య ఛేదనలో దూబేకు దివ్యాంశ్ సక్సేనా (34), ప్రసాద్ పవార్ (26), గౌరవ్ జాథర్ (11 నాటౌట్) సహకరించారు. ఈ జట్టు స్టార్ ఆటగాళ్లు ముషీర్ ఖాన్ (0), అర్జున్ టెండూల్కర్ (13) ఈ మ్యాచ్‌లో నిరాశపరిచారు.
అంతకుముందు ఆకాశ్ టైగర్స్ తరఫున ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ (34), జయ్ గోకుల్ బిస్తా (35) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కును తాకలేదు. అంధేరి బౌలర్లలో అశుతోష్ 2 వికెట్లు తీయగా.. అర్జున్ టెండూల్కర్, ముషీర్ ఖాన్, శివమ్ దూబే, ప్రసూన్ సింగ్, అజయ్ మిశ్రా తలో వికెట్ తీశారు.
పింక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న నభా నటేశ్..ఫోటోలు
శివ హీరోయిన్.. ఈ ప్రేమ జంట పెళ్లి బంధానికి 33 ఏళ్లు..! (ఫోటోలు)
విజయవాడలో కుండపోత వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫోటోలు)
ట్రెండింగ్ లో హెబ్బా పటేల్ బ్యూటిఫుల్ ఫోటోలు
ఏపీ : గోదావరి తీరాన రెండో ఉజ్జయినిగా ప్రసిద్ధికెక్కిన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
కన్నీటి ఆవేదన! ప్రాణాలు తీసుకుంటానని హెచ్చరిక..
నీ కొడుకు చేసిన పనికి నువ్వు బలి అవ్వడం ఖాయం..!
ఆ రోజు కార్మిక సంఘాలు లేకపోతే వైజాగ్ లో అడుగు పెట్టేవాడివా?
ఏపీకి రెయిన్ అలర్ట్...! ఆ జిల్లాలో భారీ వర్షాలు
బుడోడు కోసం శ్రీలంకలో ఎగబడుతున్న ఫ్యాన్స్..