
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై భీకర దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హెచ్చరించారు. ట్రూత్ సోషల్‌లో పోస్టు చేసిన ఆయన.. ఈ రోజు రాత్రి ఇరాన్‌పై అత్యంత తీవ్రంగా దాడులు
ఉంటాయన్నారు.
‘‘ఇరాన్ నౌకాదళం, వాయుసేన, రాడార్, క్షిపణి నిరోధక వ్యవస్థలతోపాటు రక్షణ రంగానికి చెందిన అన్ని వ్యవస్థలు ఇప్పటికే నాశనమయ్యాయి. సమీప భవిష్యత్తులో ఖర్గ్ ద్వీపాన్ని, ఇతర చమురు మౌలిక సదుపాయాలను స్వాధీనం చేసుకొని ఆయా మార్కెట్లపై పూర్తి నియంత్రణ సాధిస్తాం. వెనెజువెలాలో చేసిన మాదిరిగానే ఇరాన్లో మా ప్రణాళిక ఉంటుంది’’ అని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.