
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్లోని ఓ ప్రభుత్వ భవనంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో దాదాపు 4,000 ఈవీఎంలు కాలిపోయాయి. బెంగాల్ మంత్రి కౌశిక్ చౌధురీ ఈ విషయాన్ని వెల్లడించారు. కోల్కతాలోని అలీపుర్
ప్రాంతంలో ఉన్న తొమ్మిది అంతస్తుల భవనంలో బుధవారం మంటలు చెలరేగాయి. ఈ భవనంలో ఆయా ప్రభుత్వ విభాగాలతోపాటు దక్షిణ 24 పరగణాల జిల్లా పరిషత్ కార్యాలయం కూడా ఉంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బందికి 24 గంటలకుపైగానే సమయం పట్టిందట.
ఘటనాస్థలాన్ని పరిశీలించిన అనంతరం మంత్రి కౌశిక్ మాట్లాడుతూ.. ‘‘అగ్ని ప్రమాదంలో దాదాపు 4,000 ఈవీఎంలు కాలిపోయాయి. ఈ ఈవీఎంలను ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో 10 నియోజకవర్గాల్లో ఉపయోగించారు. ఇది సాధారణ అగ్ని ప్రమాదంలా కనిపించడం లేదు. ఏదైనా కుట్ర జరిగిందా? అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నాం. భవనంలోని రెండో, మూడో అంతస్తుల్లో మొదట మంటలు కనిపించాయి. మధ్యలో ఉన్న అంతస్తులపై ఎలాంటి ప్రభావం చూపకుండా.. తొమ్మిది, పదో అంతస్తులకు అవి ఎలా వ్యాపించాయనేది స్పష్టంగా తెలియరాలేదు. దీనిపై విచారణ జరుగుతోంది. ఫోరెన్సిక్ నివేదిక అనంతరం స్పష్టత వస్తుంది’’ అని తెలిపారు.
సోదాల్లో రూ.కోట్లు గుర్తింపు.. భార్య కుట్టుమిషన్ ఆదాయమట!
దక్షిణ 24 పరగణాల యంత్రాంగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన వెనుక కుట్ర కోణాన్ని కొట్టిపారేయలేమని కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ పేర్కొన్నారు. అయితే.. ఫోరెన్సిక్ పరీక్షలు, శాస్త్రీయ ఆధారాలతోనే నిర్ధారణకు వస్తామని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఆ భవనంలో ఉన్న ప్రభుత్వ రికార్డులు, మౌలిక సదుపాయాలు, భద్రతా వ్యవస్థలకు వాటిల్లిన నష్టాన్ని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
భారతీయ విమానయాన, రక్షణ రంగాల్లో సరికొత్త మైలురాయి నమోదైంది.