
యాక్షన్ హీరో విశాల్ తన కెరీర్లో మరో కీలక ముందడుగు వేశారు. నటుడిగా వరుస విజయాలు అందుకుంటున్న ఆయన, ఇప్పుడు దర్శకుడిగానూ తన ప్రతిభను చూపించబోతున్నారు. విశాల్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న
ప్రతిష్టాత్మక చిత్రం ‘మకుటం’. ‘మార్క్ ఆంటోనీ’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పవర్ఫుల్ టీజర్‌ను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. ఈ టీజర్ ఆద్యంతం యాక్షన్ ప్రియులను ఉర్రూతలూగించేలా ఉంది.మండుతున్న శవం నుంచి సిగరెట్ వెలిగించుకుంటూ విశాల్ ఇచ్చిన ఎంట్రీ గూస్బంప్స్ తెప్పిస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో విశాల్ మూడు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించనుండటం విశేషం. టీజర్లో చూపిన మూడు లుక్స్ కూడా ఆయన నటనలోని విశ్వరూపాన్ని సూచిస్తున్నాయి. ఇక హీరోయిన్ అంజలి పాత్ర కూడా చాలా భిన్నంగా ఉండబోతున్నట్లు టీజర్ స్పష్టం చేసింది. ఆమెను ఇంతవరకూ చూడని విధంగా మాస్ యాక్షన్ అవతారంలో చూపించి ఆశ్చర్యపరిచారు. హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, అదిరిపోయే విజువల్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వర్గీయ నిర్మాత ఆర్.బి. చౌదరి సమర్పణలో ఈ చిత్రం 99వ సినిమాగా రూపుదిద్దుకుంటోంది. రవి అరసు అందించిన కథ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సాంకేతిక అంశాల పరంగానూ టీజర్ ఉన్నత స్థాయిలో ఉంది. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం యాక్షన్ సన్నివేశాలకు ప్రాణం పోయగా, రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రఫీ విజువల్ ట్రీట్‌లా