
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మొదలైన సంక్షోభం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి పాకింది. అధికారాన్ని కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి లోక్‌సభలోనూ భారీ ఎదురుదెబ్బ తగిలింది
. పార్టీకి చెందిన 28 మంది లోక్‌సభ సభ్యులలో ఏకంగా 20 మంది ఎంపీలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ప్రత్యేక వర్గంగా ఏర్పడి కేంద్రంలోని ఎన్డీయే కూటమికి మద్దతు ఇవ్వాలని వారు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామం టీఎంసీలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.సీనియర్ నాయకురాలు, నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన కకోలీ ఘోష్ దస్తీదార్ ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్నారు. బుధవారం రాత్రి ఢిల్లీలో బీజేపీ సీనియర్ నేత భూపేందర్ యాదవ్ నివాసంలో ఈ రెబల్ ఎంపీలు సమావేశమైనట్లు తెలుస్తోంది. తమను ప్రత్యేక పార్లమెంటరీ గ్రూపుగా గుర్తించాలని కోరుతూ త్వరలోనే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలవాలని వారు నిర్ణయించుకున్నారు.అయితే, ఈ ఎంపీల భవిష్యత్తు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (ఫిరాయింపుల నిరోధక చట్టం) పరిధిలో ఉండటంతో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. చట్టం ప్రకారం అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలంటే, పార్టీలోని మొత్తం సభ్యులలో కనీసం మూడింట రెండొంతుల మంది విడిపోవాల్సి ఉంటుంది. టీఎంసీకి ఉన్న 28 మంది ఎంపీలలో ఈ సంఖ్య 19 కాగా, తమకు 20 మంది బలం ఉందని రెబల్ వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే, కేవలం పార్టీ నుంచి విడిపోవడం సరిపోదని, మరో పార్టీలో విలీనం అయితేనే చట్టపరమైన రక్షణ లభిస్తుందని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలోనూ టీఎంసీ ఎమ్మెల్యేలు ఇటీవలే