
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో
వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
8th Pay Commission: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎనిమిదవ వేతన కమిషన్ ప్రకటించగా ఇప్పటికే దాని పని తీరు ప్రారంభించి దాదాపు 6 నెలలు పైనే గడిచింది మరో 11 నెలల్లో 8వ పే కమిషన్ తన తది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. అయితే ఈసారి ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ఆర్థిక మాంద్యం కూడా చుట్టుముడుతున్న ఈ నేపథ్యంలో, వేతన సిఫార్సుల్లో భారీ మార్పులు ఆశిస్తూ ఇప్పటికే పలు విజ్ఞప్తులను తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ విషయంలో పెద్ద ఎత్తున పట్టుపడుతుండగా, గతంలో ఏడవ వేతన పే కమిషన్ సందర్భంగా ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ 2.57 గా నిర్ణయించారు. ఈ సారి 8వ వేతన సంఘం ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ 3.23గా నిర్ణయించాలని పట్టుబడుతున్నారు. జూన్ 15 తేదీ వరకూ వివిధ ఉద్యోగ సంఘాలు తమ సూచనలను, డిమాండ్లను వేతన సంఘానికి అందజేయడానికి చివరితేదీ కావడంతో, పలువరు ఉద్యోగులు అనేక కొత్త డిమాండ్లను ప్రస్తావన చేస్తున్నారు.
తాజాగా, నేషనల్ కౌన్సిల్ (NC-JCM) స్టాఫ్ సైడ్ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనార్థం 8వ వేతన సంఘం ముందు పలు కీలక ప్రతిపాదనలు ఉంచింది. ఉద్యోగుల కోసం కొత్త రకమైన 'అడ్వాన్స్'లను ప్రవేశపెట్టాలని మెమోరాండంలో కోరింది.
8వ వేతన సంఘం ముందు నేషనల్ కౌన్సిల్ JCM కింది డిమాండ్లను ఉంచింది. వీటిలో ప్రధానంగా పండుగల కోసం ఉద్యోగులకు ఒక నెల బేసిక్ జీతాన్ని అడ్వాన్స్‌గా ఇవ్వాలి. ప్రకృతి విపత్తుల సమయంలో ఆదుకునేందుకు ఒక నెల బేసిక్ జీతాన్ని అడ్వాన్స్‌గా అందించాలి. కార్ కొనుగోలు చేయడానికి రూ. 10 లక్షల అడ్వాన్స్ మంజూరు చేయాలనే డిమాండ్లను ముందుకు పెట్టింది.
కారు కొనుగోలుకు అడ్వాన్స్ ఇవ్వాలన్న డిమాండ్ వెనుక ఉన్న కారణాన్ని NC-JCM స్టాఫ్ సైడ్ ఉద్యోగ సంఘం వివరిస్తూ.. "ప్రస్తుత రోజుల్లో ఫోర్-వీలర్‌ను లగ్జరీగా పరిగణించలేము. కుటుంబంతో కలిసి ప్రయాణించడానికి ఇది ప్రతి ఒక్కరికీ అత్యవసరమైన వాహనంగా మారిపోయింది. కాబట్టి, 8వ వేతన సంఘం గరిష్టంగా రూ. 10 లక్షల వరకు ఫోర్-వీలర్ అడ్వాన్స్‌ను సిఫార్సు చేయాలి. ఈ రుణంపై ఎలాంటి వడ్డీ వసూలు చేయకూడదు" అని డిమాండ్ చేసింది.
ప్రకృతి విపత్తుల బారిన పడే ఉద్యోగుల కోసం ఒక నెల బేసిక్ జీతాన్ని అడ్వాన్స్‌గా ఇవ్వాలని జేసీఎం కోరింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అకాల వర్షాలు, వరదలు, తుఫానులు, కరువు వంటి ప్రకృతి విపత్తులు తరచుగా సంభవిస్తున్నాయని గుర్తుచేసింది.
గతంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ 'ప్రకృతి విపత్తు అడ్వాన్స్ పొందే అర్హత ఉండేదని, అయితే ఆ తర్వాత దానిని నిలిపివేశారని జేసీఎం తెలిపింది. ఇప్పుడు మళ్లీ వడ్డీ లేని ప్రకృతి విపత్తు అడ్వాన్స్‌ను పునరుద్ధరించాలని ప్రతిపాదించింది. దీనిని 24 వాయిదాలలో తిరిగి చెల్లించేలా ఒక నెల బేసిక్ జీతాన్ని అడ్వాన్స్‌గా సిఫార్సు చేయాలని 8వ వేతన సంఘాన్ని కోరింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.