
TMC Merger with Congress : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ (INC) లో విలీనం కాబోతోందంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న
ఊహాగానాలకు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ఇవన్నీ పూర్తిగా నిరాధారమైన ఆరోపణలని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఇటీవల ఇరు పార్టీల అగ్రనేతల మధ్య జరిగిన సమావేశం కేవలం జాతీయ స్థాయి రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలపై చర్చించేందుకు మాత్రమే పరిమితమైందని ఆయన వెల్లడించారు. విపక్షాల ఐక్యతను దెబ్బతీసేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారాలు తెరపైకి తెస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి.
Read Also : మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై మహేష్ కుమార్ గౌడ్ స్పందన
ఇటీవల జరిగిన ‘ఇండియా’ (INDIA) కూటమి సమావేశానికి మమతా బెనర్జీతో పాటు ఆ పార్టీ కీలక నేత అభిషేక్ బెనర్జీ హాజరవడం, ఆ తర్వాత వారు కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీని ప్రత్యేకంగా కలవడంతో ఈ విలీన వార్తలకు బలం చేకూరినట్లయింది. అయితే, దేశంలో ప్రస్తుతమున్న రాజకీయ పరిణామాలు, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడే వ్యూహాల గురించే సోనియా గాంధీతో మమత చర్చించారని కాంగ్రెస్ స్పష్టం చేసింది. కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య సత్సంబంధాలను విలీనంగా చిత్రీకరించడం సరికాదని, తృణమూల్ కాంగ్రెస్ తన సొంత అస్తిత్వంతోనే కొనసాగుతూ జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో కలిసి నడుస్తుందని ఇరు పార్టీల నేతలు క్లారిటీ ఇచ్చారు.
Blood Donation Benefits: రక్తదానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
ICAR-NAARM: ప్రధాని ప్రతిష్ఠాత్మక పరిశోధన గ్రాంట్‌ను కైవసం చేసుకున్న ఐకార్-నార్మ్ శాస్త్రవేత్త
India first bullet train: త్వరలో పట్టాలెక్కనున్న తొలి బుల్లెట్ రైలు.. రైల్వే మంత్రి ప్రకటన!
TMC-Congress : కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం?! సోనియా గాంధీ బంపర్ ఆఫర్?
Meenakshi Natarajan nomination: మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై మహేష్ కుమార్ గౌడ్ స్పందన
RBI new rules: NIRలకు గుడ్ న్యూస్.. ఎఫ్సీఎన్ఆర్ డిపాజిట్లపై భారీగా పెరిగిన వడ్డీ రేట్లు!
Union Minister Bandi Sanjay : భూమి అంతా కెమికల్స్‌తో నిండిపోయింది: బండి సంజయ్