
Future City : తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘ఫ్యూచర్ సిటీ’పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు
చేసి తీరుతామని ఆయన గట్టిగా పునరుద్ఘాటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఔషధ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రతిపాదించిన ‘ఫార్మాసిటీ’ కోసం స్వయంగా తాను కూడా 17 ఎకరాల భూమిని ఇచ్చానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పరిశ్రమల స్థాపన కోసం సేకరించిన విలువైన రైతుల భూములను, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మరియు ల్యాండ్ పూలింగ్ కోసమే వాడుతోందని, దీనిని తాము ఎంతమాత్రం సహించబోమని హరీష్ రావు హెచ్చరించారు.
Read Also : తెలంగాణ రాజకీయంలో ‘TRS’ వివాదం
ఎన్నికల సమయంలో ఫార్మాసిటీ భూములను తిరిగి రైతులకు ఇచ్చేస్తామని కాంగ్రెస్ నేతలు దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని హరీష్ రావు ఆరోపించారు. ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఆ భూములను వెంటనే రైతులకు వెనక్కి ఇవ్వాలని లేదా అక్కడ ఫార్మాసిటీనైనా నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్లే రాష్ట్రానికి రావాల్సిన దాదాపు Rs.70,000 కోట్ల భారీ పెట్టుబడులు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోయాయని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాల వల్ల తెలంగాణ యువత ఉపాధి అవకాశాలను కోల్పోతోందని, ఫార్మాసిటీ భూములపై కాంగ్రెస్ చేస్తున్న రియల్ దందాపై బీఆర్ఎస్ పోరాటం ఆపదని ఆయన స్పష్టం చేశారు
TMC Merger with Congress : TMC విలీనం వార్తలపై కాంగ్రెస్ క్లారిటీ
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Meenakshi Natarajan : తనపై ఉన్న కేసులు మీనాక్షికి తెలియవా: అర్వింద్
Ponguleti Srinivas Reddy: తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు కొత్త భవనాలు: మంత్రి పొంగులేటి
CP Sajjanar: రూ. 5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట
Meenakshi Natarajan nomination: మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై మహేష్ కుమార్ గౌడ్ స్పందన
Union Minister Bandi Sanjay : భూమి అంతా కెమికల్స్‌తో నిండిపోయింది: బండి సంజయ్
Government New Guidelines : విద్యార్థులకు అలర్ట్: చదువు మధ్యలో మానేస్తే స్కాలర్షిప్ వెనక్కివ్వాల్సిందే