
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బెదిరింపులకు దిగారు. ఈ రాత్రి ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బతీసేలా భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి
Jun 11 2026 6:53 PM | Updated on Jun 11 2026 7:24 PM
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బెదిరింపులకు దిగారు. ఈ రాత్రి ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బతీసేలా భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి.
ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఆయన ఇప్పటికే ఇరాన్ మిలటరీ శక్తి, సామర్థ్యాలను తుత్తునీయుల్ని చేశామని, తదుపరి సైనిక చర్య ఆసన్నమైందని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ రాత్రి ఇరాన్ ప్రభుత్వానికి నిద్ర కరువవుతుంది. ఆ దేశానికి చెందిన నేవి, ఎయిర్‌ఫోర్స్, రాడార్, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్స్‌తో పాటు మిగిలిన రక్షణ వ్యవస్థలను సర్వనాశనం చేస్తామని స్పష్టం చేశారు.
అదే సమయంలో వెనిజువెలా తరహాలో ఇరాన్‌లోని ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుని, ఆయిల్, గ్యాస్ మార్కెట్లను ఆధీనంలోకి తీసుకుంటామని తెలిపారు. ఈ నిర్ణయం వెనిజువెలా, అమెరికాకు అద్భుతంగా కలిసివస్తుందని అన్నారు. ఇరాన్-అమెరికా దాడుల కారణంగా పశ్చిమాసియాలో యుద్ధం తారాస్థాయికి చేరువవుతున్న తరుణంలో, దౌత్యపరమైన అంశాలపై మరింత అనిశ్చితి నెలకొంది.
పింక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న నభా నటేశ్..ఫోటోలు
శివ హీరోయిన్.. ఈ ప్రేమ జంట పెళ్లి బంధానికి 33 ఏళ్లు..! (ఫోటోలు)
విజయవాడలో కుండపోత వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫోటోలు)
ట్రెండింగ్ లో హెబ్బా పటేల్ బ్యూటిఫుల్ ఫోటోలు
ఏపీ : గోదావరి తీరాన రెండో ఉజ్జయినిగా ప్రసిద్ధికెక్కిన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
కన్నీటి ఆవేదన! ప్రాణాలు తీసుకుంటానని హెచ్చరిక..
నీ కొడుకు చేసిన పనికి నువ్వు బలి అవ్వడం ఖాయం..!
ఆ రోజు కార్మిక సంఘాలు లేకపోతే వైజాగ్ లో అడుగు పెట్టేవాడివా?
ఏపీకి రెయిన్ అలర్ట్...! ఆ జిల్లాలో భారీ వర్షాలు
బుడోడు కోసం శ్రీలంకలో ఎగబడుతున్న ఫ్యాన్స్..