కోడిగుడ్డు పచ్చసొనలో హెల్తీ ఫ్యాట్స్తో పాటు విటమిన్ డి కూడా ఎక్కువగా ఉంటుంది. ఎముకలు బలంగా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. అందువల్ల విటమిన్ D లోపం తగ్గాలంటే కోడిగుడ్లు తినడం మంచిది. ఫోర్టిఫైడ్
సిరియల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలోనూ విటమిన్ D ఉంటుంది. కాబట్టి విటమిన్ D లోపం ఉంటే ఈ ఫోర్టిఫైడ్ సిరియల్స్ తినడం మేలు.
మొక్కల ఆధారిత పాలలో సోయా పాలు బెస్ట్ ఆప్షన్. ఈ పాలను విటమిన్ Dతో ఫోర్టిఫైడ్ చేయడం వల్ల మీ ఎముకల బలం కోసం ఇది సహాయపడుతుంది.
ఫోర్టిఫైడ్ చేసిన బాదం పాలలో విటమిన్ D లభిస్తుంది. అందువల్ల విటమిన్ D లోపం ఉంటే ఈ ఫోర్టిఫైడ్ బాదం పాలు తాగడం చాలా మంచిది.
ఫోర్టిపైడ్ నారింజ జ్యూస్ తాగడం వల్ల కావాల్సినంత విటమిన్ D లభిస్తుంది. అలాగే ఇది రుచిగానూ ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
సాల్మోన్, మాకరెల్, సార్డైన్, ట్యూనా వంటి కొవ్వు చేపల్లో విటమిన్ D ఎక్కువగా లభిస్తుంది. అందువల్ల విటమిన్ D లోపం రాకుండా ఉండేందుకు వారానికి ఒకసారి ఈ కొవ్వు చేపలు తినడం మంచిదని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ రిపోర్ట్ తెలిపింది.
కొన్ని దేశాల్లో ఆవు పాలను విటమిన్ Dతో ఫోర్టిఫైడ్ చేస్తారు. అందువల్ల ఫోర్టిఫైడ్ చేసిన ఆవు పాలు తాగినా కూడా కావాల్సినంత విటమిన్ D లభిస్తుంది.
కాడ్ చేప లివర్ నుంచి తయారు చేసే ఈ నూనెలోనూ కావాల్సినంత విటమిన్ D లభిస్తుంది. దీనిని సప్లిమెంట్ల రూపంలోనూ తీసుకోవచ్చు.