
Ex sarpanch | తొగుట, జూన్ 11: చందాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ నర్సెట్టి లింగం అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని బీఆర్ఎస్ పార్టీ తొగుట మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి విచారం వ్యక్తం
చేశారు..చందాపూర్ లో ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సెట్టి లింగం సర్పంచ్‌గా గ్రామ అభివృద్ధికి విశేష కృషి చేశారని, ప్రజల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండే నాయకుడిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. చందాపూర్ గ్రామ అభివృద్ధిలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన సాదాసీదా వ్యక్తిత్వం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ , కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
గ్రామ సర్పంచ్ చంద లావణ్య స్వామి, గ్రామ పార్టీ అధ్యక్షులు జనగామ సుభాష్ గౌడ్, నాయకులు బండారు స్వామి గౌడ్, జూపల్లి జహంగీర్, రాంబాబు తదితరులు పాల్గొని నరిశెట్టి లింగంకు నివాళులర్పించారు.
Bharathiraja | ఇండియన్ సినిమా గమనాన్ని మార్చిన దిగ్గజం.. భారతీరాజా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
Sachin Pilot | మళ్లీ తెరపైకి రాజస్థాన్ కాంగ్రెస్ విభేదాలు.. గెహ్లాట్ వ్యాఖ్యలకు పైలట్ కౌంటర్
Peddi Collections | మొదటి వారంలోనే రూ.345 కోట్లు.. రూ. 400 కోట్ల దిశగా రామ్ చరణ్ ‘పెద్ది’