
ఇంటర్నెట్‌డెస్క్: ఆర్థిక మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో భాగంగా నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez)
వేసిన పిటిషన్ విచారణ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వైదొలిగారు.
మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్‌పై అభియోగాలు మోపాలని దర్యాప్తు సంస్థ ఈడీని దిల్లీ కోర్టు ఇటీవల ఆదేశించింది. ఆ ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్ వేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం తరఫున న్యాయబృందంలో జస్టిస్ మిశ్రా కుమారుడు ఉన్నారు. పారదర్శకత కోసం విచారణ నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన వెల్లడించారు. దాంతో వేరే ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది.
తనపై అభియోగాలు మోపాలంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలంటూ జాక్వెలిన్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అందుకు హైకోర్టు నిరాకరించడంతో.. ఆమె సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇదిలా ఉంటే.. ఈ మనీలాండరింగ్ కేసులో అప్రూవర్‌గా మారేందుకు జాక్వెలిన్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించింది. ఇక, జూన్ 3న దిల్లీ కోర్టులో జరిగిన విచారణలో భాగంగా తనపై నమోదైన అభియోగాలను ఆమె తోసిపుచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
భారతీయ విమానయాన, రక్షణ రంగాల్లో సరికొత్త మైలురాయి నమోదైంది.