
స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 419 స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేయనుంది. అమరావతి, జూన్11: స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 419 స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేయనుంది. 110 మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్, ఫార్మసిస్టుల పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను ఒప్పంద విధానంలో భర్తీ చేయనున్నట్లు విడుదల చేసిన నోటిఫికేషన్లో వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
జూన్ 13వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని అర్హులైన అభ్యర్థులకు సూచించింది. జూన్ 30వ తేదీ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ అని ప్రకటించింది. ఈ స్టాఫ్ నర్సుల పోస్టులను పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వాసుపత్రుల్లో ఎన్సీడీ క్లినిక్లు, న్యూట్రిషన్ రికవరీ సెంటర్లు, నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లతోపాటు వివిధ విభాగాల్లో భర్తీ చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వివరించింది.