మునక్కాయ ముక్కల్ని కందిపప్పుతో ఉడికించి పప్పు చేసుకోవచ్చు. వెల్లుల్లితో పోపు పెడితే చాలా బాగుంటుంది. సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ, రైస్‌లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. మునక్కాయ వేసుకుని సాంబార్
పెడితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.
తియ్యగా, పుల్లగా మునక్కాయ పులుసు చాలా బాగుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది చాలా ప్రసిద్ధి.
మునక్కాయ, బంగాళదుంపతో కూర చేసుకోవచ్చు. చపాతీ, రోటీ, అన్నంతో తింటే బాగుంటుంది.
మునక్కాయ సూప్ చాలా బాగుంటుంది. జీలకర్ర, వెల్లుల్లితో రుచిగా ఉంటుంది. వానకాలం, చలికాలంలోకి పర్ఫెక్ట్గా ఉంటుంది.
చికెన్‌తో మునక్కాయ కలిపి కూర చేసుకోవచ్చు. చికెన్ ప్రియులకు ఇది బాగా నచ్చుతుంది.
మునక్కాయలో కొబ్బరి పేస్ట్ వేసి కూర చేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది. అందరికీ నచ్చుతుంది.
పెరుగుతో చేసే ఈ కూర చాలా బాగుంటుంది. వేసవికి పర్ఫెక్ట్గా ఉంటుంది. మసాలాలు కూడా తక్కువగా ఉంటాయి.
మునక్కాయను ముక్కలుగా కట్ చేసి మసాలాలతో వేయించి వేపుడు చేసుకోవచ్చు. సైడ్ డిష్‌గా బాగుంటుంది.