
ఇంటర్నెట్ డెస్క్: ముక్కోణపు సిరీస్‌లో భారత్ A బ్యాటర్లు అదరగొట్టేస్తున్నారు. తాజాగా అఫ్గాన్ Aతో జరుగుతున్న మ్యాచ్‌లో భారీ లక్ష్యం నిర్దేశించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా 49
ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. మధ్యలో వర్షం కారణంగా ఆటను ఒక్క ఓవర్ కుదించడం జరిగింది. ప్రభ్ సిమ్రన్ సింగ్ (84), రుతురాజ్ గైక్వాడ్ (66), తిలక్ వర్మ (66) హాఫ్ సెంచరీలు సాధించారు. అఫ్గాన్ బౌలర్లలో అబ్దుల్లా 5, సాఫి 3, ఇమ్రాన్ ఒక వికెట్ తీశారు.
శ్రీలంకపై త్వరగానే పెవిలియన్‌కు చేరిన వైభవ్ సూర్యవంశీ ఈసారి మాత్రం వెనుకడుగు వేయలేదు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడటం మొదలు పెట్టాడు. అయితే, సిక్స్‌లు లేకుండా కేవలం ఫోర్లతోనే ఇన్నింగ్స్‌ను ఆడటం గమనార్హం. 22 బంతుల్లోనే 44 పరుగులు సాధించాడు. మరోవైపు ప్రభ్ నిలకడగా ఆడుతూనే అప్పుడప్పుడు దూకుడు ప్రదర్శించాడు. ప్రియాంశ్ ఆర్య (8) త్వరగానే పెవిలియన్‌కు చేరాడు. కానీ, రుతురాజ్ - తిలక్ వర్మ మాత్రం చెలరేగిపోయారు. నిలకడగా ఆడుతూనే పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో అర్ధశతకాలు నమోదు చేశారు. ఆఖర్లో సూర్యాంశ్ షెడ్జే (40), అనుకుల్ రాయ్ (16*) వేగంగా ఆడారు. కానీ, స్వల్ప వ్యవధిలో వికెట్లను కోల్పోవడంతో భారత్ 350+ మార్క్‌ను అందుకోలేకపోయింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.