
మొట్టమొదటి ‘ఫార్చ్యూన్ ఇండియా-ఇంటర్‌బ్రాండ్ అత్యంత విలువైన సెలబ్రిటీల’ (India’s Most Valuable Celebrities) జాబితాలో సౌత్ నుంచి ఒకే ఒక్కడికి స్థానం దక్కింది. అతడే అల్లు అర్జున్ (Allu Arjun)
.
దక్షిణాది నుంచి చాలామంది సెలబ్రిటీలు యాడ్స్ చేస్తున్నప్పటికీ, మరీ ముఖ్యంగా మహేష్ బాబు లాంటి నటులు యాడ్స్ లో దూసుకుపోతున్నప్పటికీ, అత్యంత విలువైన, క్రెడిబిలిటీ కలిగిన సెలబ్రిటీగా టాప్-10లో బన్నీకి మాత్రమే చోటు దక్కడం విశేషం.
ఇంటర్ బ్రాండ్ భాగస్వామ్యంతో ఫార్చ్యూన్ ఇండియా విడుదల చేసిన ఈ జాబితాను కొన్ని అంశాల ఆధారంగా తయారుచేశారు. నటీనటుల ఎంగేజ్ మెంట్, వాళ్లకు ఉన్న ఆదరణ, విశ్వసనీయత, వాళ్ల విలక్షణత, ఓవరాల్ గా మార్కెట్ పై వాళ్ల చూపించిన ప్రభావం ఆధారంగా జాబితాను తయారు చేశారు. ఇందులో మహేష్ కంటే బన్నీకే ఎక్కువ రేటింగ్ వచ్చింది. అంతేకాదు, ఏకంగా టాప్-10లో చోటు దక్కింది.
రూ. 1,522 కోట్లు బ్రాండ్ విలువతో జాబితాలో పదో స్థానంలో నిలిచాడు బన్నీ.
ఈ టాప్ 10 జాబితాలో విరాట్ కోహ్లి, రూ.3542 కోట్లుతో మొదటి స్థానంలో నిలవగా.. షారూక్ (రూ.3017) రెండో స్థానంలో, ప్రియాంక చోప్రా (రూ.2507) మూడో స్థానంలో నిలిచారు.
ఇక ఐదో స్థానంలో రణ్వీర్ సింగ్, ఆరో స్థానంలో అక్షయ్ కుమార్ ఉన్నారు. పుష్ప-1, పుష్ప-2 సినిమాలతో దేశవ్యాప్తంగా ఆదరణ దక్కించుకున్న అల్లు అర్జున్ మాత్రమే టాప్-10లో చోటు సంపాదించుకోగలిగాడు.
ఇక జాబితాలో 11వ స్థానంలో దీపిక పదుకోన్ నిలవగా, 17వ స్థానంలో రష్మిక, 25వ స్థానంలో నయనతార నిలిచారు. లిస్టులో సినిమా సెలబ్రిటీల కంటే, క్రికెటర్లకే ఎక్కువ స్థానాలు దక్కాయి.