
పీఎం కిసాన్ రైతులకు భారీ అలర్ట్ జూన్ 18న 23వ వాయిదా డబ్బులు పడతాయా? అధికారిక వెబ్సైట్లో స్టేటస్ ఎలా చెక్ చేయాలి PM Kisan 23rd Installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. అతి త్వరలో పీఎం కిసాన్
23వ వాయిదా రాబోతుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు రూ. 2వేలు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద 22వ విడతను మార్చి 13, 2026న విడుదల చేసింది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ. 2వేలు జమ అయ్యాయి. దాదాపు 3 నెలల తర్వాత రైతులకు 23వ విడత విడుదల కావాల్సి ఉంది. ముఖ్యంగా జూన్ 18వ తేదీన (PM Kisan 23rd Installment) ఈ విడత డబ్బులను మోదీ విడుదల చేయనున్నారంటూ చర్చలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. ఈ నెల 18న నిజంగా పీఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయా? లేదా కేవలం అంచనా మాత్రమేనా? అనేది వివరంగా తెలుసుకుందాం.. పీఎం కిసాన్ యోజన 23వ విడత విడుదలపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. జూన్ 18న ఈ విడత వస్తుందనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. అయితే, ఈ తేదీన పీఎం కిసాన్ రూ. 2వేలు పడేందుకు అవకాశం లేకపోలేదు. ఎందుకంటే.. 2024లో పీఎం నరేంద్ర మోదీ పీఎం కిసాన్ యోజన 17వ విడతను జూన్ 18న విడుదల చేశారు. డీబీటీ ద్వారా దేశవ్యాప్తంగా 9 కోట్లకు పైగా రైతుల ఖాతాలకు రూ. 20వేల కోట్లకు పైగా డబ్బులను విడుదల చేశారు. అందుకే ప్రభుత్వం రాబోయే విడతను కూడా జూన్ 18న విడుదల చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రతి ఏటా రూ. 6వేలు ఆర్థిక సాయం : పీఎం కిసాన్ యోజన కింద అర్హులైన రైతులకు ఏటా రూ. 6వేలు ఆర్థిక సాయం అందుతుంది. ఈ మొత్తాన్ని ప్రతి 4 నెలలకు రూ. 2వేలు చొప్పున 3 సమాన వాయిదాలలో రైతుల ఖాతాలకు అవుతుంది. Read Also : Realme P4R 5G : బడ్జెట్ ధరలో బ్యాటరీ బీస్ట్.. AI ఫీచర్లతో కొత్త రియల్‌మి P4R 5G.. ఫస్ట్ సేల్ ఎప్పుడంటే? సాధారణంగా, ఫస్ట్ వాయిదా ఏప్రిల్-జూలై మధ్య, రెండవది ఆగస్టు-నవంబర్ మధ్య, మూడవది డిసెంబర్-మార్చి మధ్య విడుదల అవుతుంది. 23వ వాయిదా జూన్ చివరిలో లేదా జూలై ప్రారంభంలో విడుదల అవుతుందని భావిస్తున్నారు. అర్హత, అప్లికేషన్ స్టేటస్ : రైతులు తప్పనిసరిగా ముందుగానే తమ అర్హత, అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. ఇ-కేవైసీ, ఆధార్ లింక్ లేదా బ్యాంకు అకౌంట్ వివరాలలో ఏవైనా సమస్యలు ఉంటే వాయిదాలు నిలిచిపోవచ్చు. అధికారిక వెబ్సైట్లో ఎలా చెక్ చేయాలి? : లబ్ధిదారు రైతులు అధికారిక పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ను విజిట్ చేసి స్టేటస్‌ను ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ముందుగా (pmkisan.gov.in) పోర్టల్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత, 'Farmers Corner'కు వెళ్లి 'Beneficiary Status' ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఆపై మీ రిజిస్ట్రేషన్ నంబర్ క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి. మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి మీకు పూర్తి పేమెంట్ అప్లికేషన్ డేటా కనిపిస్తుంది. ప్రస్తుతానికి, రైతులు అనాధికారిక ప్రకటనలపై ఆధారపడొద్దు. వేచి ఉండాలని 23వ విడత రావడం పక్కా. కానీ, ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాకే కచ్చితమైన తేదీ తెలుస్తుంది. అప్పటిలోగా రైతులందరూ తమ రికార్డులను అప్డేట్ చేసి రెడీగా ఉండండి. కొత్త అప్డేట్స్ కోసం పీఎం కిసాన్ పోర్టల్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తుండాలి.