
అమరావతి: స్టీల్‌ప్లాంట్ అనే పదం పలికేందుకు కూడా జగన్‌కు అర్హత లేదని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన కార్మికులను వైకాపా అధ్యక్షుడు జగన్ బుధవారం పరామర్శించారు. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. జగన్ ఆస్పత్రికి వచ్చినా ఆయన పార్టీ కార్యకర్తలు ఏవేవో నినాదాలు చేశారని విమర్శించారు.
‘‘సీఎం హోదాలో జగన్ ఎప్పుడైనా స్టీల్‌ప్లాంట్‌కు వెళ్లారా? అక్కడి కార్మికుల సమస్యల గురించి మాట్లాడారా? మృతుల కుటుంబాలకు స్టీల్‌ప్లాంట్, కేంద్రం, రాష్ట్రం పరిహారం ఇచ్చాయి. మృతుల కుటుంబాలకు రూ.కోటి కంటే ఎక్కువ పరిహారం అందుతుంది. చనిపోయిన ఒప్పంద కార్మికుల కుటుంబానికి కూడా పరిహారం, ఉద్యోగం ఇస్తున్నాం. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు రాజకీయంగా విమర్శలు సరికాదు’’అని మంత్రి అనిత అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
సీఎం చంద్రబాబు ఓ మహిళకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. అసంపూర్తిగా ఉన్న ఇంటి నిర్మాణం పూర్తి చేయించారు.
విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో గాయపడిన కార్మికులను పరామర్శించేందుకు వెళ్లిన వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సఫలీకృతులయ్యారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ప్రశంసించారు.