
ఇంటర్నెట్ డెస్క్: అగ్ర నటుడు బాలకృష్ణ (Balakrishna) తదుపరి చిత్రాలపై కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన కోసం దర్శకులు వివేక్ ఆత్రేయ (Vivek Athreya), విజయ్ కనకమేడల (Vijay
Kanakamedala) కథలు సిద్ధం చేస్తున్నారని, త్వరలోనే ఆ ప్రాజెక్టులు పట్టాలెక్కే అవకాశాలున్నాయని సినీ వర్గాల్లో వినిపించింది. అయితే, ఇప్పుడు ఆ డైరెక్టర్లే బాలకృష్ణతో కలిసి దిగిన ఫొటోలను పంచుకోవడంతో (వేర్వేరుగా) అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. నేడు (జూన్ 10) బాలయ్య పుట్టినరోజు సందర్భంగా.. ఈ ఇద్దరూ ఆయన్ను కలిసి విష్ చేశారు. సంబంధిత ఫొటోలను షేర్ చేస్తూ.. బాలయ్యపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ పిక్స్తోనే తమ సినిమాలపై ఓ క్లారిటీ ఇచ్చినట్టైంది.
మరోవైపు, ప్రస్తుతం బాలకృష్ణతో సినిమా చేస్తున్న మరో దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాతలు సతీశ్ కిలారు, రవిశంకర్ యలమంచిలి తదితరులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘వీరసింహారెడ్డి’ తర్వాత బాలకృష్ణ- గోపీచంద్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఎన్బీకే 111’ (వర్కింగ్ టైటిల్)పై అంచనాలు నెలకొన్నాయి. ‘బ్రోచేవారెవరురా’, ‘సరిపోదా శనివారం’ తదితర చిత్రాలతో మెప్పించిన డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. ‘నాంది’, ‘భైరవం’లాంటి సినిమాలు రూపొందించిన దర్శకుడు విజయ్ కనకమేడల.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
హైదరాబాద్: సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సిల్వర్ జూబ్లీ ప్రారంభ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. చిన్నారులకు కేక్ తినిపించి ఆశీస్సులు, బహుమతులు అందించారు. కొందరు దాతలు, పాఠశాల విద్యార్థులు విరాళాలను బాలయ్యకు అందజేశారు. ఆ ఫొటోలు..
అలియా భట్, శార్వరీ వాఘ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఆల్ఫా’ టీజర్ విడుదలైంది.
దిగ్గజ దర్శకుడు భారతీరాజా (84) మృతితో సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది.
వయసు కేవలం నంబర్ మాత్రమేనన్నారు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ.
ప్రముఖ దర్శకుడు భారతీరాజా (Bharathiraja) మరణం తీరనిలోటని నటి ముచ్చర్ల అరుణ, నటుడు అలీ సంతాపం తెలిపారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా (Bharathiraja) మరణం తీరనిలోటని నటి ముచ్చర్ల అరుణ, నటుడు అలీ సంతాపం తెలిపారు.