
America-Iran War : పశ్చిమాసియా మరియు గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా మారుతున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దాడులు-ప్రతిదాడులు (war) తీవ్రరూపం దాల్చడంతో ఈ ప్రాంతం మరో భారీ యుద్ధం
అంచునకు చేరుకుంది. అమెరికా వైమానిక దాడులకు ప్రతీకారంగా బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా తాము వ్యూహాత్మక దాడులు నిర్వహించినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అధికారికంగా ప్రకటించింది.
Read Also: Apache Helicopter Crash: కూలిన అపాచీ హెలికాప్టర్.. పైలట్లను కాపాడేందుకు రంగంలోకి ‘AI సముద్ర డ్రోన్’
ఇరాన్ ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ నివేదికల ప్రకారం, గల్ఫ్ రీజియన్‌లో ఉన్న మొత్తం 21 అమెరికా వైమానిక, నౌకాదళ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. కమాండ్ సెంటర్ ధ్వంసం: జోర్డాన్‌లోని కీలకమైన ‘అల్-అజ్రాక్’ అమెరికా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఇరాన్ క్షిపణులు పూర్తిగా ధ్వంసం చేశాయి. జోర్డాన్‌లోని ‘మువాఫాక్ సల్తీ’ ఎయిర్‌బేస్‌పై జరిగిన క్షిపణి దాడుల్లో, అమెరికాకు చెందిన అత్యాధునిక ఎఫ్-35 (F-35) యుద్ధ విమానాలను ఉంచే హ్యాంగర్లను సైతం కూల్చివేసినట్లు ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అయితే, ఈ ఆస్తి నష్టంపై అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ధ్రువీకరణ రాలేదు. దక్షిణ ఇరాన్‌లోని జాస్క్, సిరిక్, ఖెష్మ్ ప్రాంతాలపై అమెరికా అంతకుముందు జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు ఇరాన్ వెల్లడించింది. అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్‌కు చెందిన ఒక టెలికమ్యూనికేషన్ టవర్, రెండు నీటి ట్యాంకులు ధ్వంసమయ్యాయి. దీనికి కౌంటర్‌గా స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:30 గంటలకు బహ్రెయిన్‌లోని అమెరికా ‘ఐదో నౌకాదళ ప్రధాన కార్యాలయం’ (US 5th Fleet Headquarters) పై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది.
AP Aqua Farmers: ఆక్వా రైతులకు శుభవార్త.. రూ.1.50కే విద్యుత్
Medak district: రామోజిపల్లిలో మద్యం విక్రయిస్తే ఫైన్ ..పట్టిస్తే రూ.5 వేల రివార్డ్
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Apache Helicopter Crash: కూలిన అపాచీ హెలికాప్టర్.. పైలట్లను కాపాడేందుకు రంగంలోకి ‘AI సముద్ర డ్రోన్’
US-Iran War : US దాడులపై ఖచ్చితంగా బదులిస్తాం – ఇరాన్
Narendra Modi: మోదీ 12 ఏళ్ల పాలనపై అమెరికా సెనేటర్ల అభినందనలు
Israel: ఇజ్రాయెల్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు
POKలో పాక్ బలగాల కాల్పులు..ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్
Pok: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉద్రిక్తతలు.. సైన్యం కాల్పుల్లో 30 మంది మృతి