
Renault Duster: రెనాల్ట్ డస్టర్ తన ఎస్ యూవీ సెగ్మెంట్లో మరోసారి తన సత్తా చాటుతోంది. కొత్త 1.0లీటర్ టీసీఈ 100 టర్బో పెట్రోల్ ఇంజిన్ తో వచ్చిన ఈ సరికొత్త మోడల్ డ్రైవింగ్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుందని
చెప్పాలి. కేవలం ఫీచర్లు మాత్రమే కాదు అద్భుతమైన డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ కు రైడ్ కంఫర్ట్ కు ప్రాధాన్యత ఇచ్చే వారికి ఈ కొత్త మోడల్ సరైన ఎంపికగా నిలుస్తోందని చెప్పాలి.
ఈ ఎస్ యూవీలో అమర్చిన 1.0లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 100 హెచ్పీ శక్తిని, 166 ఎన్ఏం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. పరిమాణంలో చిన్న ఇంజిన్ చిన్నగా ఉన్నప్పటికీ దీని పనితీరు మాత్రం అద్భుతంగా ఉందనే చెప్పాలి. నగర ట్రాఫిక్ లో కానీ.. హైవేలపై వేగంగా వెళ్లేటప్పుడు గానీ పవర్ డెలివరీ చాలా సాఫీగా బలంగా ఉంటుంది. ముఖ్యంగా 3 సిలిండర్ ఇంజిన్ అయినప్పటికీ శబ్దం వైబ్రేషన్స్ చాలా తక్కువగా ఉండటం విశేషమనే చెప్పాలి.
దేశీయ రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా డస్టర్ రైడ్ క్వాలీటీ ఎప్పటివలే అద్భుతంగా ఉంది. దీని సస్పెన్షన్ గుతుకుల రూడ్లపై కూడా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సేఫ్ గా చూస్తుంది. 17 అంగుళాల వీల్స్ ఉండటంతో ప్రయాణం మరింత సాఫీగా సాగుతోంది. హైవేలపై ప్రయాణించేటప్పుడు కూడా కారు చాలా స్థిరంగా ఉండి డ్రైవర్ కు మంచి విశ్వాసాన్ని ఇస్తుందని చెప్పాలి.
ఇక డిజైన్ తోపాటు మైలేజీ విషయానికి వస్తే.. డస్టర్ ఎప్పటి మాదిరిగానే తన బలమైన ఆకర్షణీయమైన లుక్స్ తో ఆకట్టుకుంటుంది. క్యాబిన్ లోపల కూడా విశాలమైన స్థలం ఉండటంతో ఫ్యామిలీతో ప్రయాణించేందుకు అనువుగా ఉంటుంది.
మైలేజీ విషయానికి వస్తే మిశ్రమ డ్రైవింగ్ పరిస్థితుల్లో ఇది లీటర్ కు సుమారు 11-13 కిలోమీటర్ల మైలేజీని అందిస్తోంది. హైవేలపై 5వ, 6వ గేర్లలో తక్కువ ఆర్పీఎం వద్ద ప్రయాణించడం వల్ల మెరుగైన ఇంధన కెపాసిటీని పొందవచ్చు. మొత్తానికి డ్రైవింగ్ ఎంజాయ్ చేసేవారికి ఈ డస్టర్ 1.0టర్బో ఒక బలమైన ఆప్షన్ గా నిలుస్తుందని చెప్పాలి.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.