
ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ పోలీసు శాఖ మహిళలు, బాలలపై నేరాలకు పాల్పడేవారికి త్వరితగతిన శిక్షలు పడేలా చేయడమే లక్ష్యం పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా. చిత్రంలో పోలీసు ఉన్నతాధికారులు పీహెచ్డీ రామకృష్ణ, సీహెచ్.శ్రీకాంత్, మహేష్ చంద్ర లడ్డా, రాజకుమారి, శ్రీదేవిరావు, ఆర్కే మీనా, మధుసూదన్‌రెడ్డి ఈనాడు, అమరావతి: మహిళలు, బాలలపై నేరాలకు తెగబడేవారికి త్వరితగతిన శిక్షలు పడేలా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర పోలీసు శాఖ ‘ఆపరేషన్ దండాయన’ పేరిట ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
అందులో భాగంగా ఇలాంటి కేసులన్నింటినీ అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తారు. పక్కాగా దర్యాప్తు చేపట్టి అన్ని రకాల సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలతో అభియోగపత్రాలు దాఖలు చేసేలా చర్యలు తీసుకుంటారు. న్యాయస్థానాల్లో ఆ కేసు విచారణ వేగంగా పూర్తయ్యేలా స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ సిస్టమ్ తెస్తారు.
ఆ కేసుల ట్రయల్‌కు సంబంధించిన పురోగతిని జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకూ వివిధ దశల్లో ఎప్పటికప్పుడు సమీక్షించి.. ట్రయల్ త్వరగా పూర్తయ్యేందుకు అన్ని చర్యలూ చేపడతారు. అత్యంత హేయమైన, సంచలనాత్మక కేసుల ట్రయల్‌ను ఫాస్ట్‌ట్రాక్ కోర్టులకు బదిలీ చేసి దోషులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటారు.
అత్యాచారాలు, లైంగిక వేధింపులు, పోక్సో కేసులపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్ఎల్పీఆర్బీ ఛైర్మన్ ఆర్కే మీనా, నిఘా విభాగాధిపతి మహేష్ చంద్ర లడ్డా, శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీ ఎన్.మధుసూదన్‌రెడ్డి, ఐజీలు సీహెచ్.
శ్రీకాంత్, పీహెచ్డీ రామకృష్ణ, బి.రాజకుమారి ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ ‘ఆపరేషన్ దండాయన’ కార్యక్రమం గురించి వివరించారు. ప్రధాన అంశాలివి. లైంగిక నేరగాళ్లపై సెక్సువల్ అఫెండర్స్
షీట్లు: మహిళలు, బాలలపై పదే పదే నేరాలకు పాల్పడే వారిని, అనుమానాస్పద వ్యక్తులను జియోట్యాగింగ్ చేస్తాం. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌తో కూడిన సీసీ కెమెరాల ద్వారా వారి కదలికలపై ప్రత్యేక నిఘా పెడతాం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
© 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
This website follows the DNPA Code of Ethics.