
ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పర్యటనకు దిల్లీ వెళుతున్నారు. బుధవారం ఉదయం 11:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి దిల్లీ వెళతారు. భారత్ మండపంలో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9
గంటల వరకు జరిగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొంటారు. గురువారం రాష్ట్రపతి భవన్లో ఉదయం 9:15 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి హాజరవుతారు. రాత్రి 9 గంటలకు బయలుదేరి అమరావతి చేరుకుంటారు. బీ ఎన్డీఏ పక్షాల సమావేశంలో పాల్గొనేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ మంగళవారం దిల్లీ చేరుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.