
సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’ పంపిన ఓ అత్యవసర అలర్ట్, ఉత్తరప్రదేశ్ పోలీసుల మెరుపు వేగం కలిసి ఓ 25 ఏళ్ల యువకుడి ప్రాణాన్ని కాపాడాయి. ఇన్‌స్టాలో ఆత్మహత్యకు సంబంధించిన పోస్ట్ పెట్టిన కేవలం ఎనిమిది
నిమిషాల్లోనే మీరట్ పోలీసులు అతని వద్దకు చేరుకున్నారు. ఆసుపత్రిలో చేర్పించి ప్రాణాలను నిలిపారు. ఉత్తరప్రదేశ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్, మెటా సంస్థల మధ్య ఉన్న ప్రత్యేక ఒప్పందం వల్ల ఇది సాధ్యమైంది.యూపీలోని మీరట్ జిల్లా సర్ధానా ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ప్రేమ విఫలమవడంతో తీవ్ర మానసిక ఒత్తిడి, కుంగుబాటుకు లోనయ్యాడు. ఈ క్రమంలో జూన్ 7న అతను ఓ తెల్లటి ద్రవాన్ని తాగుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేశాడు. దానికి ‘‘ఇక నువ్వు నీ జీవితంలో సంతోషంగా ఉండు’’ అనే క్యాప్షన్‌ను జోడించాడు. ఎవరైనా తమకు తాము హాని చేసుకునేలా పోస్ట్‌లు పెడితే గుర్తించే మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ వెంటనే అలర్ట్ అయ్యింది.జూన్ 7 సాయంత్రం 6.53 గంటలకు మెటా సంస్థ ఈ ఆత్మహత్య హెచ్చరికను నేరుగా ఉత్తరప్రదేశ్ పోలీస్ ప్రధాన కార్యాలయంలోని సోషల్ మీడియా సెంటర్‌కు పంపింది. డీజీపీ ఆదేశాల మేరకు, ఆ సెంటర్ అధికారులు లొకేషన్, మొబైల్ నంబర్ ఆధారంగా మీరట్ పోలీసులను అప్రమత్తం చేశారు. సర్ధానా పోలీసులు సమాచారం అందిన కేవలం 8 నిమిషాల్లోనే ఆ యువకుడి ఇంటికి చేరుకున్నారు.పోలీసులు వెళ్లేసరికి ఆ యువకుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. అతని పక్కనే ఒక అనుమానాస్పద ద్రవం ఉన్న బాటిల్ కూడా లభ్యమైంది. పోలీసులు