
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా
సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Cheppal Bazar 3 Siblings Drown In Godavari River: పవిత్ర పుణ్యక్షేత్రమైన బాసర గోదావరి నదిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అమ్మవారి దర్శనం కోసం వచ్చి నదిలో కుటుంబంతో సరదాగా స్నానం ఆచరించడానికి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నాదమ్ములు గోదావరి నదిలో దిగారు. కానీ, పుణ్యస్నానాలు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు చంద్రశేఖర్, రామచందర్, మల్లేష్ కుమార్‌లు నదిలో గల్లంతయ్యారు. వెంటనే స్థానికులు మిగతా కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..