
రామ్‌చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రంపై ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించారు. సోమవారం రాత్రి కుటుంబ సభ్యులతో సినిమా చూసిన ఆయన ఎక్స్ వేదిక అభినందనలు తెలిపారు. రామ్‌చరణ్ నటించిన
‘పెద్ది’ (Peddi) చిత్రంపై ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రశంసల వర్షం కురిపించారు. సోమవారం రాత్రి కుటుంబ సభ్యులతో సినిమా చూసిన ఆయన ఎక్స్ వేదిక అభినందనలు తెలిపారు. ‘పెద్ది’ సినిమా చూశాను. నా ప్రియమైన సోదరుడు రామ్‌చరణ్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన నటన సందర్భానుసారంగా రఫ్‌గా, సహజంగా ఉండటమే కాకుండా, బాడీ ట్రాన్స్ఫర్మేషన్), డ్యాన్స్‌లో చూపించిన గ్రేస్ అన్నీ అసాధారణం. సినిమాలో ప్రతి సీను, ప్రతి అంశంలోనూ ఏస్, గ్రేస్ చూపించారు. నా బ్రదర్ రామ్‌చరణ్‌ను చూస్తే గర్వంగా ఉంది. జనాల నుంచి వస్తున్న ప్రశంసలకు ఆయన అర్హుడు. జగపతిబాబు గారి నటన మైండ్ బ్లోయింగ్. ఇతర నటీనటులు కూడా పాత్రలకు న్యాయం చేశారు. లీడింగ్ లేడీ జాన్వీ కపూర్ చక్కని పాత్ర పోషించింది. సినిమా కోసం శ్రమించిన సాంకేతిక నిపుణులు నిర్మాతలందరికీ అభినందనలు. సినిమాలో ప్రతి పాత్రను అత్యుత్తమంగా చూపిస్తూ, ముఖ్యంగా చరణ్‌ను మరింత ఉన్నత స్థ్థాయిలో ఆవిష్కరించిన దర్శకుడు బుచ్చిబాబు సానాకు నా హృదయపూర్వక అభినందనలు’ అని ట్వీట్లో పేర్కొన్నారు.
రామ్‌చరణ్, జాన్వీకపూర్ జంటగా నటించిన పెద్ది చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. వృద్ధి సినిమా పతాకంపై వెంకట్ సతీశ్ కిలారు నిర్మించిన ఈ చిత్రం విడుదలైన ఐదు రోజుల్లో రూ.315 కోట్లు కలెక్షన్లు రాబట్టింది.