
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలను మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. ప్రమాదంలో చనిపోయిన ఎమినిది మంది బంధువులను పరామర్శించి.. వారి నుంచి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. విశాఖపట్నం
, జూన్ 9: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలను మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. ఈరోజు(మంగళవారం) ఉదయం కేజీహెచ్ ఆస్పత్రికి చేరుకున్న మంత్రి.. మార్చురీలో ఎంతమంది ఉన్నారనే దానిపై జాయింట్ కలెక్టర్ విద్యాధరిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో చనిపోయిన ఎమినిది మంది బంధువులను పరామర్శించారు. వారి నుంచి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆపై సెవన్ హిల్స్ ఆస్పత్రికి మంత్రి వెళ్లారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సెవన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మరికాసేపట్లో స్టీల్ ప్లాంట్ ప్రమాదస్థలిని మంత్రి లోకేశ్ పరిశీలించనున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. లాడిల్ నుంచి ద్రవ ఉక్కు బకెట్లు కింద పడిపోయాయి. పలువురు కార్మికులపై ద్రవ ఉక్కు పడి అక్కడికక్కడే బూడిదయ్యారు. ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు మృతి చెందారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని విధంగా మారాయి. అటు ఎనిమిది మృతదేహాలను పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. మృతదేహాలను గుర్తించేందుకు మృతుల బంధువుల శాంపిల్స్‌ను తీసుకుని ల్యాబ్‌కు పంపిస్తామని వైద్యులు చెబుతున్నారు. డీఎన్ఏ పరీక్షలు పూర్తయ్యేందుకు నాలుగు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారు విశాఖలోని కిమ్స్, సెవన్ హిల్స్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తల్లి, చెల్లికి వెన్నుపోటు పొడిచిన జగన్ మహిళలపై మాట్లాడటం విడ్డూరం: సానా సతీశ్
స్టీల్ ప్లాంట్ ప్రమాదం దురదృష్టకరం: మంత్రి వాసంశెట్టి సుభాశ్