ప్రముఖ సినీ నేపథ్య గాయని సునీత కుమారుడు ఆకాష్ గోపరాజు కథానాయకుడిగా నటించిన రెండో చిత్రం ‘కొత్త మలుపు’ జూన్ 12న థియేటర్లలో విడుదల కానుంది. శివ వరప్రసాద్ దర్శకత్వంలో, కోనసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ
రొమాంటిక్ లవ్ అండ్ సస్పెన్స్ ఎంటర్టైనర్ ప్రమోషన్స్‌లో ఆకాష్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. టైటిల్‌కు తగ్గట్టే కథలో ఊహించని మలుపులు ఉంటాయని, తన పాత్ర నేటి యువతకు ప్రతిరూపంగా ఉంటుందని తెలిపారు. “నా మొదటి సినిమా 'సర్కారు నౌకరి' ఒక పీరియడ్ డ్రామా. కానీ, నా రెండో ప్రయత్నమైన 'కొత్త మలుపు' దానికి పూర్తి భిన్నమైన కథాంశంతో సాగుతుంది. ఇదొక విలేజ్ బ్యాక్‌డ్రాప్ రొమాంటిక్ లవ్ అండ్ సస్పెన్స్ ఎంటర్టైనర్. ఒక సగటు కుర్రాడు సరదాగా సాగిపోయే పాత్రతో కూడిన సబ్జెక్టు ఇది. సరిగ్గా నేను ఎలాంటి క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నానో, డైరెక్టర్ శివ వరప్రసాద్ కేశనకుర్తి గారు నాకు అచ్చం అలాంటి కథనే చెప్పారు. టైటిల్‌కు తగ్గట్టే ఇందులో వచ్చే ఊహించని ట్విస్టులు, మలుపులు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి గారు ఈ టైటిల్ సూచించడం మాకు దక్కిన గౌరవం” అని తెలిపారు. * ‘క్రిష్ 4’ ఆగిపోయిందా?.. రూ. 500 కోట్ల బడ్జెట్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన రాకేశ్ రోషన్ “ఈ సినిమాలో నా పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. నేటి యువత ఆలోచనా ధోరణికి, వారి ఎమోషన్స్‌కు చాలా దగ్గరగా అనిపిస్తుంది. మొదటి సినిమాతో పోలిస్తే నా బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్, యాక్టింగ్ స్కిల్స్ పరంగా చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇందులో హీరోయిన్ భైరవి అర్ధ్యాతో నా కెమిస్ట్రీ కొత్తగా ఉంటుంది. మా ఇద్దరి మధ్య బావ-మరదళ్ల వరస ఉంటుంది. పల్లెటూరి నేపథ్యంలో మా మధ్య సాగే ప్రేమ, చిలిపి గొడవలు, సరదా సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తాయి. మా అమ్మ కెరీర్ విషయంలో నాకు పూర్తి స్వేచ్ఛ ఇస్తుంది. ఎప్పుడూ నా వెన్నంటే ఉండి నన్ను గైడ్ చేస్తుంటుంది. ఈ సినిమా చూసి అమ్మ చాలా హ్యాపీగా ఫీలైంది. అవుట్‌పుట్ చాలా బాగా వచ్చిందని, ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని చెప్పి ఎంతో ప్రోత్సహించింది.” * బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ కలెక్షన్ల సునామీ.. ఫస్ట్ వీకెండ్లో కళ్లుచెదిరే కలెక్షన్లతో సరికొత్త రికార్డు! “ఇక మా నిర్మాత తాటి బాలకృష్ణ గారు ఎక్కడా రాజీ పడకుండా భారీ నిర్మాణ విలువలతో, ప్యాషన్‌తో ఈ సినిమాను నిర్మించారు. కోనసీమలోని అందమైన లోకేషన్లను ప్రతి ఫ్రేమ్‌లోనూ ఎంతో గ్రాండ్‌గా, సహజత్వానికి దగ్గరగా చూపించారు. అలాగే మా చిత్రానికి మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ తోడు కావడం చాలా పెద్ద బలం. ఈ దిగ్గజ సంస్థ మా కంటెంట్‌ను నమ్మి ముందుకు రావడం వల్ల సినిమాపై ప్రేక్షకుల్లో మరింత నమ్మకం పెరిగింది. రఘుబాబు గారు, పృథ్వీరాజ్ గారు, ప్రభావతి గారి వంటి సీనియర్ల అనుభవం మాకెంతో ప్లస్ అయింది. అలాగే సంగీత దర్శకుడు యశ్వంత్ నాగ్ అందించిన మెలోడీస్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. పల్లెటూరి అందాలు, నవ్వులు, సస్పెన్స్ కలగలిసిన ఈ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'కొత్త మలుపు' జూన్ 12న థియేటర్లలోకి వస్తోంది. ప్రేక్షకులంతా థియేటర్లకు వచ్చి సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను’ అంటూ ఆకాష్ గోపరాజు ఇంటర్వ్యూ ముగించారు.