
Oil Price : దేశంలో సామాన్యుడిపై భారంగా మారిన పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూల సంకేతాలు ఇచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు ఎక్కువ కాలం పాటు గరిష్ట
స్థాయిల్లో కొనసాగే అవకాశం లేదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. రానున్న కొన్ని నెలల్లోనే దేశీయంగా ఆయిల్, గ్యాస్ రేట్లు గణనీయంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. అంతర్జాతీయ సరఫరా గొలుసులో వస్తున్న సానుకూల మార్పులు, ఉత్పత్తి దేశాల వ్యూహాత్మక నిర్ణయాల వల్ల త్వరలోనే వినియోగదారులకు ఇంధన ధరల భారం నుండి ఉపశమనం లభిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also : నా స్నేహితుడికి వేరే దారి లేదు..ఇరాన్ ఒప్పందాన్ని అంగీకరించాల్సిందే: ట్రంప్
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) ఒక నెల రోజుల పాటు పూర్తిగా మూతపడినా.. భారత్ ఆ సంక్షోభాన్ని సులువుగా తట్టుకోగలదని మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. దేశ అవసరాలకు సరిపడా దాదాపు 76 నుండి 80 రోజులకు సరిపోయే వ్యూహాత్మక చమురు నిల్వలు (Strategic Petroleum Reserves) భారతదేశం వద్ద సిద్ధంగా ఉన్నాయని ఆయన భరోసా ఇచ్చారు. ఈ అంతర్జాతీయ సముద్ర మార్గం గుండా ముడి చమురును రవాణా చేసేందుకు భారత్ ఎలాంటి అదనపు రవాణా రుసుములు లేదా ఫీజులు చెల్లించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ రకమైన ముందస్తు ప్రణాళికల వల్ల అంతర్జాతీయ ఇంధన సంక్షోభాలు ఎదురైనా దేశీయ సరఫరాకు ఎలాంటి ఢోకా ఉండదని కేంద్రం ధీమా వ్యక్తం చేసింది.
Jobs in Universities : APలోని యూనివర్సిటీల్లో ప్రభుత్వ ఉద్యోగాలు..!!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Trump’s warning : ఇజ్రాయెల్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్
Donald Trump : ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
Israel-Iran War : నా స్నేహితుడికి వేరే దారి లేదు..ఇరాన్ ఒప్పందాన్ని అంగీకరించాల్సిందే: ట్రంప్
Tsunami warnings in the Philippines : ఫిలిప్పీన్స్లో ఒకవైపు సునామీ మరోవైపు భూకంపం.. వణుకుతున్న ప్రజలు
Indian-American : లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో నిత్యా రామన్ ముందంజ