
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన 'పెద్ది' (Peddi) చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్నప్పటికీ, చిత్రంలో మహిళా పాత్రల చిత్రణపై సరికొత్త వివాదం రేగింది. పెద్ద బడ్జెట్ చిత్రాల్లో
హీరోయిన్లను కేవలం పురుషుల కోరికలను నెరవేర్చే గ్లామర్ బొమ్మలుగా (ఆబ్జెక్టిఫికేషన్) చూపే అలవాటు భారతీయ సినిమాలో ఇంకా మారలేదని 'ఇండియా టుడే' తన తాజా కథనంలో విశ్లేషించింది. గతంలో భారీ విజయాలు సాధించిన 'పుష్ప: ద రైజ్', 'కేజీఎఫ్' చిత్రాల తరహాలోనే 'పెద్ది' సినిమా కూడా అదే పాత పంథాను అనుసరించిందని విమర్శకులు తప్పుబడుతున్నారు.జూన్ 4న విడుదలైన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో హీరోయిన్ అచ్చియమ్మ (జాన్వీ కపూర్) పాత్రకు కథలో ఎలాంటి ప్రాధాన్యం లేదని, కేవలం ఆమె నడుము, శారీరక సౌందర్యాన్ని ప్రదర్శించే కెమెరా యాంగిల్స్ పైనే దర్శకుడు శ్రద్ధ పెట్టారని ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హీరో బలవంతంగా ముద్దు పెట్టుకునే సీన్, విలన్లు ఆమె బట్టలు లాగేందుకు ప్రయత్నించే సీన్లు తీవ్ర అసంతృప్తిని రేకెత్తించాయి. ఈ తీవ్రమైన ట్రోలింగ్, సోషల్ మీడియా నిరసనలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు సానా మహిళలను కించపరిచే ఉద్దేశం తమకు లేదని చెబుతూ బహిరంగ క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా, వివాదాస్పదంగా మారిన దాదాపు మూడు నిమిషాల సీన్లను సినిమా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.మలయాళ చిత్ర పరిశ్రమ మహిళా పాత్రలకు బలమైన గుర్తింపు ఇస్తున్నప్పటికీ.. తెలుగు, తమిళ, కన్నడ పరిశ్రమల్లోని పెద్ద బడ్జెట్ కమర్షియల్ సినిమాలు కేవలం 'మాస్ అప్పీల్' కోసమే నాయికలను వాడుకుంటున్నాయని