రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ 'పెద్ది'. ఇటీవలే విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. మరోవైపు ఈ సినిమాని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి
. ఇప్పటికే హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రను చిత్రీకరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ సినిమాపై మరో వివాదం చెలరేగింది. 'పెద్ది' చిత్రంపై తాజాగా ఆదివాసీ సంఘాలు అభ్యంతరం తెలిపాయి. సినిమాలో గిరిజనులను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఆదివాసీ సంఘాలు ఫిర్యాదు చేశాయి. 'పెద్ది' చిత్ర బృందం, సెన్సార్ అధికార్లపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. 'పెద్ది' సినిమా మొత్తం నిడివిలో 15 సార్లు గిరిజనులను కించపరిచేలా పదాలు ఉన్నాయని ఆదివాసీ సంఘాలు ఫిర్యాదులో పేర్కొన్నాయి. గిరిజన హక్కుల చట్టంలో స్పష్టం చేసిన పదాలనే సినిమాలో అసభ్యంగా వినియోగించారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాలో ఉపయోగించిన పదాలను సోషల్ మీడియా ఇన్ఫ్లెన్సర్లు కూడా ఇష్టానుసారం వినియోగించటంపై ఆదివాసీలు మండిపడ్డారు. దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.