
హైదరాబాద్లో ఆహార భద్రత, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్న H-FAST (Hyderabad Food Adulteration Surveillance Team) బృందం మృగశిర కార్తి రోజున భారీ ఆపరేషన్ నిర్వహించారు. హైదరాబాద్ నగరంలోని
అంబర్పేట్, అత్తాపూర్, కూకట్పల్లి, పెద్ద అంబర్పేట్ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన అధికా రులు చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న లారీలను అడ్డగించి తనిఖీ నిర్వ హించారు. హైదరాబాద్లోని కోళ్ల మార్కెట్లు, మాంసం దుకాణాల నుంచి సేకరిం చిన చికెన్ వ్యర్థాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండరింగ్ ప్లాంట్లకు తరలించాల్సి ఉండగా, కొందరు అక్రమంగా వాటిని చేపల చెరువులకు ఆహారంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
ఈ నేపథ్యంలో చేపట్టిన దాడుల్లో తొమ్మిది లారీలను అదుపులోకి తీసుకుని సుమారు 120 టన్నుల చికెన్ వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ వ్యర్థాలను ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, భీమవరం, వినుకొండ, అద్దంకి ప్రాంతాల చేపల చెరువులకు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో బయటపడినట్లు పేర్కొంటున్నారు. చేపల పెంపకంలో ఇలాంటి వ్యర్థాల వినియోగం ప్రజారోగ్యానికి హానికరమని నిపుణులుహెచ్చరిస్తున్నారు. కాగా, హైదరాబాద్ పోలీసులు ఇటీవల ఆహార కల్తీ, నాసిరకం ఆహార పదార్థాల విక్రయాలను అరికట్టేందుకు H-FAST ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ బృందం నగరవ్యాప్తంగా ఆహార భద్రతకు సంబంధిం చిన అక్రమాలపై నిఘా పెంచారు..
బీటెక్ విద్యార్థి మిస్సింగ్ కేసు...చివరకు విషాదాంతం
నాలుగేళ్లుగా సీక్రెట్ ఎఫైర్...అత్తను పెళ్లాడిన అల్లుడు
.